ETV Bharat / sitara

ఇద్దరు ప్రముఖ నిర్మాతలతో మెగాహీరో సినిమా?

author img

By

Published : Aug 10, 2020, 5:30 AM IST

మెగా మేనల్లుడు సాయితేజ్​ తదుపరి చిత్రాన్ని ఇద్దరు ప్రముఖ టాలీవుడ్​ నిర్మాతలు రూపొందించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం 'సోలో బతుకే సో బెటరు' సినిమాతో థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు తేజ్​.

TWO TOP PRODUCERS TO BANKROLL MEGA HERO NEXT?
సాయి

మెగా కుటుంబం నుంచి వచ్చి.. తనదైన శైలిలో వినూత్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకున్న హీరో సాయి తేజ్​. ఇటీవలే 'ప్రతిరోజు పండగే' సినిమాతో సూపర్​ హిట్​ అందుకొని మంచి జోరుమీదున్నాడు. తాజాగా, ఈ మెగా హీరో తదుపరి చిత్రం గురించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు ప్రముఖ టాలీవుడ్​ నిర్మాతలు బీవీఎస్ఎన్​ ప్రసాద్​, దిల్​ రాజు సంయుక్తంగా సాయితో సినిమా తెరకెక్కించనున్నారట. ఇటీవలే ఓ నూతన దర్శకుడు తేజ్​కు స్క్రిప్ట్​ వినిపించగా.. బాగా నచ్చిందని సమాచారం.

అయితే, ప్రస్తుతం పలు సినిమా ఒప్పందాలతో బిజీ అయిపోయిన తేజ్.. 2022లోనే ఈ చిత్రాన్ని సెట్స్​పైకి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. విశేషమేంటంటే సాయి తేజ్​ నటించిన 'పిల్లా నువ్వులేని జీవితం' తొలి చిత్రానికి దిల్​రాజు నిర్మాత కాగా, తేజ్​ హీరోగా తెరకెక్కుతున్న 'సోలో బతుకే సో బెటరు' సినిమాకు బీవీఎస్ఎన్​ ప్రసాద్​ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.