తెలుగులో 'దేవదాసు' చిత్రంతో యువకుల మనసు దోచిన నటి ఇలియానా. ఈమధ్య కాలంలో సామాజిక మాధ్యమాల్లో కుర్రకారుకి కిర్రెక్కించే ఫొటోలు పెడుతూ తెగ హల్‌చల్ చేస్తోంది. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో పెడుతున్న ఈ ఫోజులపై కొందరు అభిమానుల ప్రశ్నలకు ఈ సన్న నడుము సుందరి స్పందించింది.
"ఇవి నిజంగా నీ ఫొటోలేనా లేక ఫొటోషాప్ చేసి పెడుతున్నావా?" అని ఓ నెటిజన్ అడిగాడు. దీనికి ఇలియానా జవాబిస్తూ.."ఫొటో షాప్ చేసిన ఫొటోలను నేనెప్పుడూ పెట్టను. అలాంటి పనులు నాకిష్టం ఉండదు. అలా పెడితే మన వ్యక్తిత్వం ఏముంటుంది. మనసుకు నచ్చిన పని చేయాలి తప్ప ఎవరో ఏదో అనుకుంటారని భయపడాల్సిన పనిలేదు" అని చెప్పింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
మరో అభిమాని కూడా ఈ వయ్యారి భామకు ఓ ప్రశ్న వేశాడు. "మీకు చిత్రసీమలో సన్నిహితులు, స్నేహితులు ఎవరైనా ఉన్నారా" అని ఆ అభిమాని అడిగాడు. "అవును నేను.. ప్రముఖ నటి నర్గీస్ ఫక్రీతో చాలా సన్నిహితంగా ఉంటాను. అంతేకాదు నటులు వరుణ్ ధావన్, అర్షద్ వార్షిలు నాకు ఆప్తులు" అని చెప్పుకొచ్చింది ఇలియానా.
ప్రస్తుతం 'అనీష్ బజ్మీ' దర్శకత్వంలో 'పాగల్ పంతి'లో నటిస్తుందీ భామ. ఇందులో అనిల్ కపూర్, జాన్ అబ్రహాం, కృతి కర్బందా తదితర నటీనటులు కనువిందు చేయనున్నారు.
ఇదీ చూడండి : అప్పుడు ప్రియాంక.. ఇప్పుడు ఆయుష్మాన్