అతడు... తన మాటలతో ప్రేక్షకులని మాయ చేసే మాటల మాంత్రికుడు. ప్రాసల 'ఖలేజా'తో ప్రేక్షకులను ఆకట్టుకునే మాటల రచయిత, దర్శకుడు. ఆయన మాటలకు అబ్బురపడిన ప్రేక్షకులు 'నువ్వు నాకు నచ్చావ్' అన్నారు. 'జై చిరంజీవా' అంటూ ఆశీర్వదించారు. ఆ మధ్య 'అరవింద సమేత'తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రస్తుతం 'అల వైకుంఠపురములో' చిత్రాన్ని రూపొందిస్తున్న త్రివిక్రమ్ పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ సినిమాల్లోని ఫేమస్ డైలాగ్‌లు మీకోసం.
- మనం గెలిచినప్పుడు చప్పుట్లు కొట్టే వాళ్లు, మనం ఓడిపోయినప్పుడు భుజం తట్టే వాళ్లు నలుగురు లేనప్పుడు.. ఎంత సంపాదించినా, ఎంత పోగొట్టుకున్నా తేడా ఏముండదు- వెంకటేశ్
- వయసు అయిపోయిన హీరోలందరూ రాజకీయ నాయకులు అయినట్టు.. ఫెయిల్ అయిన ప్రేమికులు అందరూ ఫ్రెండ్స్ అయిపోలేరు-వేణు
- మనం తప్పు చేస్తున్నామో రైట్ చేస్తున్నామో మనకు తెలుస్తుంది.. మనకు మాత్రమే తెలుస్తుంది-తరుణ్
- నిజం చెప్పకపోవడం అబద్ధం. అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం-మహేశ్‌బాబు
- మనం ఇష్టంగా అనుకున్నదే అదృష్టం.. బలంగా కోరుకునేది భవిష్యత్తు-అల్లు అర్జున్
- మనుషులు పుట్టాకే సంప్రదాయాలు పుట్టాయి. సంప్రదాయాలు పుట్టాక మనుషులు పుట్టలేదు-సుహాసిని
- ఆడపిల్లకు గుణాన్ని మించిన ఆస్తి లేదు- విక్టరీ వెంకటేశ్
- ఒక మనిషిని ప్రేమిస్తే, వాళ్లు చేసే తప్పుని కూడా మనం క్షమించగలగాలి-తరుణ్
- అద్భుతం జరిగేటపుడు ఎవరూ గుర్తించరు. జరిగిన తర్వాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు-రావు రమేశ్
- ఆడపిల్లలు... ఎంత తొందరగా ప్రేమిస్తారో అంత తేలిగ్గా మర్చిపోతారు-మన్మథుడు సినిమా
- దెయ్యం కంటే భయం మహా చెడ్డదండి-సునీల్
- తండ్రికి, భవిష్యత్తుకు భయపడని వాడు.. జీవితంలో పైకి రాలేడు-విజయ్ కుమార్
- విడిపోయేటపుడే బంధం విలువ.. తెగిపోయేటపుడే దారం విలువ తెలుస్తుంది- రావు రమేశ్
- బెదిరింపునకు భాష అవసరం లేదు.. అర్థమైపోతుంది-ముఖేశ్ రిషి
- పనిచేసి జీతం అడగొచ్చు. అప్పిచ్చి వడ్డీ అడగొచ్చు. కాని హెల్ప్ చేసి మాత్రం థాంక్స్ అడక్కూడదు-వెంకటేశ్
- బాధలో ఉన్నవాడిని ఎలా ఉన్నావు అని అడగడం అమాయకత్వం. బాగున్నవాడిని ఎలా ఉన్నావు అని అడగడం అనవసరం- చంద్రమోహన్
- కారణం లేని కోపం, ఇష్టం లేని గౌరవం, బాధ్యత లేని యవ్వనం, జ్ఞాపకం లేని వృద్ధాప్యం అనవసరం-పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్
- ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు - అత్తారింటికి దారేది
- మనసులో ఉన్న మనిషి పక్కన మామూలుగా తిరగడం చాలా కష్టం-వర్ష
- సంపాదించడం చేతకాని వాడికి ఖర్చు పెట్టే అర్హత లేదు- చంద్రమోహన్