యువ కథానాయకుడు రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం 'రెడ్'. నివేదా పేతురాజ్, మాళవిక శర్మ, అమృత అయ్యర్ కథానాయికలు. కిషోర్ తిరుమల దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గురువారం చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
రామ్ నుంచి అభిమానులు, ప్రేక్షకులు ఏం కోరుకుంటారో ఈ చిత్రంతో అవన్నీ లభిస్తాయని చిత్ర బృందం తెలిపింది. మణిశర్మ అందించిన పాటలు ఇప్పటికే ఎంతో పాపులర్ అయ్యాయి. తమిళంలో ఘన విజయం సాధించిన 'తడమ్' చిత్రానికి రీమేక్‌గా 'రెడ్' తెరకెక్కుతోంది. 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత రామ్ నుంచి వస్తున్న సినిమా కావడం వల్ల దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి.