హీరో అర్జున్ కపూర్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న బాలీవుడ్ సినిమా ‘ఇండియాస్ మోస్ట్ వాంటెడ్’. తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. రాజ్‌కుమార్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.
భారత్‌లో ఎన్నో దాడులకు పాల్పడిన ‘ఇండియాస్ ఒసామా’ అనే ఉగ్రవాది నేపథ్యంలో తీసిన సినిమా ఇది. అతను ఎవరో? ఎలా ఉంటాడో? ఎవరికీ తెలియదు. ఈ నేరగాడిని పట్టుకోవడానికి మన దేశానికి చెందిన ఐదుగురు వ్యక్తులు ఆయుధాలు వాడకుండా ఏం చేశారు? అన్నదే ఈ సినిమా కథ.
ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ప్రభాత్‌గా కనిపించనున్నాడు అర్జున్. మే 24న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.
- " class="align-text-top noRightClick twitterSection" data="">