కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో సినీ ప్రముఖులందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అన్‌లాక్ తర్వాత చిత్రీకరణలకు ప్రభుత్వాలు అనుమతులిచ్చినప్పటికీ.. వైరస్ భయంతో స్టార్ హీరోలెవరూ షూటింగ్‌లను ప్రారంభించే సాహసం చేయలేదు. అయితే తాజాగా సూపర్‌స్టార్ మహేశ్‌బాబు షూటింగ్‌కు హాజరయ్యారు. అయితే అది సినిమా షూటింగ్ కాదు.. వాణిజ్య ప్రకటన చిత్రీకరణ.
హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఈ షూటింగ్ జరిగింది. కరోనా నిబంధనలు పాటిస్తూ రెండ్రోజుల్లో షూటింగ్ పూర్తి చేశారట. తాజాగా ప్రిన్స్ లుక్‌ను అవినాష్ గోవార్కర్ అనే సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ షేర్ చేయగా.. దానికి రీట్వీట్ చేస్తూ మహేశ్ సమాధానం ఇచ్చారు. ప్యాకప్ షాట్స్ సమయంలో అవినాష్ తీసే ఫొటోలను మిస్ అయినట్లు సూపర్‌స్టార్ తెలిపారు. మళ్లీ షూటింగ్లో పాల్గొనడంపైనా హర్షం వ్యక్తం చేశారు.
-
Missed your post pack up shots!! Good to be back 😎 @avigowariker 🤗🤗👍🏻👍🏻 https://t.co/n8kioYaVpT
— Mahesh Babu (@urstrulyMahesh) September 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Missed your post pack up shots!! Good to be back 😎 @avigowariker 🤗🤗👍🏻👍🏻 https://t.co/n8kioYaVpT
— Mahesh Babu (@urstrulyMahesh) September 9, 2020Missed your post pack up shots!! Good to be back 😎 @avigowariker 🤗🤗👍🏻👍🏻 https://t.co/n8kioYaVpT
— Mahesh Babu (@urstrulyMahesh) September 9, 2020
-
Superstar Mahesh Babu participating in the shooting for the first time post lockdown. He is doing an ad shoot at Annapurna Studio. pic.twitter.com/UbiLsQzXAB
— Censor Reports 💎 (@CensorReports) September 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Superstar Mahesh Babu participating in the shooting for the first time post lockdown. He is doing an ad shoot at Annapurna Studio. pic.twitter.com/UbiLsQzXAB
— Censor Reports 💎 (@CensorReports) September 9, 2020Superstar Mahesh Babu participating in the shooting for the first time post lockdown. He is doing an ad shoot at Annapurna Studio. pic.twitter.com/UbiLsQzXAB
— Censor Reports 💎 (@CensorReports) September 9, 2020
డిసెంబర్లో చిత్రీకరణ...?
మహేశ్ బాబు హీరోగా.. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ సినిమా తొలి షెడ్యూల్ కోసం చిత్రబృందం అమెరికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే డిసెంబర్లో చిత్రీకరణకు ప్రణాళిక రచిస్తున్నారట దర్శకనిర్మాతలు. అగ్రరాజ్యంలోనే నెలరోజుల పాటు షూటింగ్ కొనసాగనుందట. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది వేసవికి సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు సమాచారం.
మైత్రీ మూవీ మేకర్స్, 14రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా 'సర్కారు వారి పాట'ను నిర్మిస్తున్నాయి. ఇటీవలే విడుదలైన మోషన్ పోస్టర్‌తో.. సినిమాపై అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. అందులో మహేష్ గడ్డంతో కూడిన మాస్‌లుక్‌లో కనిపించారు. కీర్తి సురేష్ హీరోయిన్. తమన్ సంగీత దర్శకుడు.