ETV Bharat / sitara

ఏప్రిల్​ వచ్చేసింది.. సినీ సందడి తెచ్చేసింది! - ఏప్రిల్ 30న విరాటపర్వం

ఏప్రిల్ నెలలో పవన్​కల్యాణ్ నటించిన 'వకీల్​సాబ్'​తో పాటు మరికొన్ని చిత్రాలు బాక్సాఫీస్ ముందుకు రానున్నాయి. మార్చి ముగిసిన నేపథ్యంలో ఏప్రిల్ నెలలో విడుదల కానున్న చిత్రాలేంటో చూద్దాం.

Tollywood Movies will release in April
ఏప్రిల్​లో విడుదల
author img

By

Published : Apr 1, 2021, 9:52 AM IST

కరోనా లాక్​డౌన్​ తర్వాత థియేటర్లు తెరుచుకోవడం వల్ల వరుస సినిమాలతో బాక్సాఫీస్​ కళకళలాడుతోంది. ఇప్పటికే విడుదలైన చాలా చిత్రాలు హిట్ టాక్ అందుకోగా.. మరికొన్ని బ్లాక్​బస్టర్​లుగా నిలిచి కలెక్షన్ల వర్షం కురిపించాయి. సంక్రాంతి నుంచి మొదలైన ఈ విజయపరంపర తాజాగా విడుదలైన 'గాలి సంపత్', 'జాతిరత్నాలు' వరకు కొనసాగుతూనే ఉంది. ఇదే జోష్​తో ఏప్రిల్​లోనూ పలు చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఇందులో పవన్ కల్యాణ్ నటించిన 'వకీల్​సాబ్'​ కూడా ఉండటం విశేషం. మార్చి ముగిసి ఏప్రిల్ ప్రారంభమైన నేపథ్యంలో ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రాలేంటో చూద్దాం.

ఏప్రిల్ 2

వైల్డ్ డాగ్

కింగ్ నాగార్జున ఎన్​ఐఏ అధికారి విజయ్​ వర్మగా నటించిన చిత్రం 'వైల్డ్ డాగ్'. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్​ యూట్యూబ్​లో రికార్డు వ్యూస్​తో దూసుకెళ్తోంది. ఇటీవలే ఈ సినిమా సెన్సార్​ పనులు పూర్తిచేసుకుని యూ/ఏ సర్టిఫికెట్​ అందుకుంది. హైదరాబాద్​లో జరిగిన పేలుళ్ల(గోకుల్ చాట్-2007, దిల్​సుఖ్​నగర్-2013) నేపథ్యంతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఏప్రిల్ 2న థియేటర్లలో రిలీజ్ కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సుల్తాన్

'రెమో' సినిమాతో తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులనీ మెప్పించిన యువ దర్శకుడు బక్కియరాజ్‌ కణ్ణన్‌. ఆవారా, ఊపిరి, ఖైదీ వంటి చిత్రాలతో టాలీవుడ్​కు దగ్గరైన నటుడు కార్తి. వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రం 'సుల్తాన్‌'. రష్మిక కథానాయికగా నటించింది. ఏప్రిల్‌ 2న తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో విడుదల కానుంది.

ఏప్రిల్ 9

వకీల్​సాబ్

పవర్​స్టార్ పవన్ కల్యాణ్ చాలా కాలం తర్వాత బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నారు. రాజకీయాల కారణంగా కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న పవన్​.. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా మారారు. ఈయన రీఎంట్రీ ఇస్తున్న చిత్రం 'వకీల్​సాబ్'. హిందీలో ఘనవిజయం సాధించిన 'పింక్'​కు రీమేక్​గా రూపొందింది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల, శ్రుతి హాసన్, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలు పోషించారు. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ యూట్యూబ్​లో రికార్డులు తిరగరాస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఏప్రిల్ 16

లవ్​స్టోరీ

అక్కినేని హీరో నాగచైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న రొమాంటిక్ చిత్రం 'లవ్‌స్టోరీ'. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోంది. కరోనా వైరస్ ముందే సినిమా చిత్రీకరణ చాలా వరకు పూర్తి చేసుకుంది. కానీ కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. తాజాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఏప్రిల్ 23

టక్ జగదీష్

నేచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'టక్ జగదీష్'. రీతూవర్మ, ఐశ్వర్యా రాజేశ్ కథానాయికలు. కుటుంబకథా చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమా ఈ నెల 23న విడుదల కానుంది. 'నిన్నుకోరి' తర్వాత నాని, శివ నిర్వాణ కాంబోలో వస్తోన్న చిత్రం కావడం వల్ల మంచి అంచనాలు ఉన్నాయి.

తలైవి

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం 'తలైవి'. కంగనా రనౌత్​ హీరోయిన్​గా చేస్తున్నారు. ఏఎల్‌ విజయ్ దర్శకుడు. ఈ సినిమా తమిళ, హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఏప్రిల్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఏప్రిల్ 30

విరాట పర్వం

దగ్గుబాటి రానా, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం 'విరాటపర్వం'. వేణు ఊడుగుల దర్శక్వం వహిస్తున్నారు. 1990ల్లో సాగే కథ ఇది. ఇందులో కామ్రేడ్ రవన్నగా రానా కనిపించబోతున్నారు. ప్రియమణి, నందితా దాస్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సీటీమార్

కథానాయకుడు గోపీచంద్, దర్శకుడు సంపత్​ నంది కాంబినేషన్​లో రూపొందుతోన్న కొత్త చిత్రం 'సీటీమార్​'. కబడ్డీ నేపథ్యంతో తెరకెక్కనున్న సినిమాలో.. గోపీచంద్​ సరసన హీరోయిన్​గా తమన్నా నటిస్తోంది. మొదటగా ఈ సినిమాను ఏప్రిల్ 2న విడుదల చేయాలని భావించినా అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది. తాజాగా ఈ చిత్రాన్ని ఈ నెల 30న విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోందట. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.