ETV Bharat / sitara

డిసెంబర్ 10న లక్ష్య.. 'బంగార్రాజు' నుంచి మరో అప్డేట్ - డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. లక్ష్య, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ, బంగార్రాజు చిత్రాల కొత్త సంగతులు ఇందులో ఉన్నాయి.

movies
సినిమాలు
author img

By

Published : Dec 4, 2021, 10:17 PM IST

నాగశౌర్య 'లక్ష్య' సినిమా డిసెంబరు 10న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్​ నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్​లో బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, హీరో శర్వానంద్, దర్శకుడు శేఖర్ కమ్ముల పాల్గొనున్నారు.

ఆర్చరీ నేపథ్యంగా తీసిన ఈ సినిమాలో శౌర్య సరసన కేతిక శర్మ హీరోయిన్​గా నటించింది. జగపతిబాబు కీలకపాత్ర పోషించారు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించారు. కాలభైరవ సంగీతమందించారు.

lakshya
లక్ష్య

మరో తెలుగు సినిమా నేరుగా ఓటీటీలో విడుదల చేయనున్నారు. అదిత్, శివాని హీరోహీరోయిన్లుగా నటించిన 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ' చిత్రాన్ని త్వరలో ఓటీటీలో రిలీజ్​ రిలీజ్ చేస్తామని చిత్రబృందం చెప్పింది. డిసెంబరు 24 నుంచి సోనీలివ్​లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని సమాచారం.

తెలుగులోనే తొలి కంప్యూటర్​ స్క్రీన్ బేస్డ్ మూవీగా దీనిని తెరకెక్కించారు. కేవీ గుహన్ దర్శకత్వం వహించారు. సిమాన్ కే కింగ్ సంగీతమందించారు.

www
డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ

'బంగార్రాజు' సినిమాలోని 'నా కోసం' పూర్తి సాంగ్​ను ఆదివారం విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ పాటలో నాగచైతన్య, కృతిశెట్టి కనిపించనున్నారు.

bangarraju
బంగార్రాజు

'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాకు ఇది ప్రీక్వెల్​గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఒరిజినల్​లో నటించిన నాగార్జున, రమ్యకృష్ణ ఇందులోనూ అవే పాత్రల్లో కనిపించనున్నారు. కల్యాణ్​ కృష్ణ కురసాల దర్శకత్వం వహించారు. నాగార్జున.. అన్నపూర్ణ స్టూడియోస్​ బ్యానర్​పై నిర్మించారు. ఈ సినిమా సంక్రాంతి రేసులో ఉన్నట్లు సమాచారం. త్వరలో విడుదల తేదీ వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.

ఇదీ చదవండి:

మోదీ రమ్మన్నా 'నో' చెప్పిన పునీత్​.. కారణం ఇదే...

రాయ్ లక్ష్మి.. నీ బ్యూటీ వావ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.