ETV Bharat / sitara

తిరిగి సెట్లో అడుగుపెట్టిన 'నారప్ప' - venkatesh movie update

వెంకటేష్​ నటిస్తున్న 'నారప్ప' చిత్ర షూటింగ్​ తిరిగి షురూ అయింది. హైదరాబాద్​లో చిత్రీకరణ జరుగుతున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఫ్యామిలీ నటుడుగా పేరున్న వెంకటేష్​ ఈ చిత్రంలో మాస్​ లుక్​లో కనిపించబోతున్నారు.

UPDATE OF MOVIE NARAPPA
సెట్లో అడుగుపెట్టిన 'నారప్ప'
author img

By

Published : Nov 6, 2020, 5:52 AM IST

కరోనా పరిస్థితులతో ఆగిన 'నారప్ప' చిత్రం హైదరాబాద్‌లో పునఃప్రారంభమైంది. వెంకటేష్‌ కథానాయకుడు. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకుడు. డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌.థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రియమణి కథానాయిక. లాక్‌డౌన్‌కు ముందే 60రోజుల చిత్రీకరణ పూర్తికాగా.. ఇప్పుడు భాగ్యనగరంలో తిరిగి షూటింగ్‌ ప్రారంభమైంది.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. "అనంతపురం జిల్లా పాల్తూరు గ్రామంలో ఈ చిత్రాన్ని మొదలుపెట్టి, తమిళనాడులోని కురుమలై, తెరికాడు రెడ్‌ డెసర్ట్‌లో కీలక యాక్షన్‌ సన్నివేశాలు షూట్‌ చేశాం. ఇప్పుడు హైదరాబాద్‌లో ప్రియమణి, రావు రమేష్‌, రాజీవ్‌ కనకాల తదితర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు, క్లైమాక్స్‌ చిత్రీకరిస్తున్నాం. ఈ షెడ్యూల్‌తో 80శాతం చిత్రీకరణ పూర్తవుతుంది. మిగిలిన ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌ను పూర్తి చేసి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం" అన్నారు. ఈ సినిమాకు సంగీతం: మణిశర్మ, కూర్పు: మార్తాండ్‌ కె.వెంకటేష్‌. కథ: వెట్రిమారన్‌, ఛాయాగ్రహణం: శ్యామ్‌ కె.నాయుడు.

ఇదీ చూడండి: 'నారప్ప' యాక్షన్ కోసం మరో దర్శకుడు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.