Tollywood Mass movies of 2022: మాస్ అనే మాటకి ఒక్కో చోట ఒక్కో నిర్వచనం ఉంటుంది. మన దగ్గర మాస్ అంటే వాణిజ్య సూత్రం. బాక్సాఫీసు మురిపెం. తెలుగులో మాస్ సినిమాకి ప్రత్యేకమైన కొలతలు ఉంటాయి. వీరోచితమైన ఫైట్లు... ఊపు తెప్పించే పాటలతోపాటు... కథానాయకుడు నీటుగా కాకుండా నాటుగా కనిపిస్తూ, నాటు పనులు చేస్తూ ప్రేక్షకులకు వినోదాలు పంచుతుండాలి. గతంలో ఇలాంటి చిత్రాల హవా నడిచింది. కథా ప్రాధాన్యంతో కూడిన సినిమాలు అలవాటయ్యాక... కొత్తతరం కథల జోరు పెరిగాక మార్పు వచ్చింది. మాస్ కథల జోరు తగ్గింది. అగ్ర హీరోలు కథా ప్రాధాన్య సినిమాలు చేయడం మొదలుపెట్టారు. అలాగని మాస్ కథలకి కాలం చెల్లిందని కాదు. టెంప్లేట్ కథైనా, ఫార్ములా అయినా కొత్తగా ఉంటే చాలు... ఇప్పటికీ ఆ సినిమాలకి బ్రహ్మరథం పడుతుంటారు ప్రేక్షకులు. ఆ విషయం ఎప్పటికప్పుడు ఏదో ఒక చిత్రం రుజువు చేస్తూనే ఉంది. గతేడాది వచ్చిన ‘క్రాక్’, ఈమధ్యే ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘అఖండ’ మాస్ పవర్ ఏమిటో మరోసారి బాక్సాఫీస్‌కి రుచి చూపించాయి. అందుకే సీనియర్లతోపాటు, యువతరం హీరోలు ఎంత కొత్త రకమైన సినిమాలు చేసినా మధ్యలో ఓ మాస్ కథపై కన్నేస్తుంటారు.
Suriya ET movie: 'ఆకాశం నీ హద్దురా', 'జై భీమ్' సినిమాలు చేసిన సూర్య... ఆ వెంటనే వాటికి పూర్తి భిన్నమైన 'ఈటీ' చేశారు. ‘జై భీమ్’ తరహాలోనే ‘ఈటీ’లో న్యాయవాదిగానే కనిపించారు, నల్లకోటు వేసుకునే పోరాటం చేశారు. అయితే ఇందులో పోరాటం వేరు, ఈ కథ వేరు. పూర్తిస్థాయి మాస్ కొలతలతో రూపొందింది. ప్రేక్షకులు ఈల కొట్టి గోల చేస్తూ ఆస్వాదించేలా వాణిజ్యాంశాల్ని జోడించారు. అలా తెలుగు కథానాయకులూ క్రమం తప్పకుండా మాస్ మంత్రం జపిస్తుంటారు. అగ్ర హీరోలు ఏ సినిమా చేసినా వాటిలో మాస్ అంశాలు కొన్ని తప్పనిసరిగా ఉంటాయి. ఎప్పుడూ కొత్త రకమైన సినిమాలు చేసే కుర్రహీరోలూ ఇప్పుడు మాస్ కథలపై గురి పెడుతున్నారు.
Rampotineni Boyapati movie: రామ్ పోతినేని ‘ది వారియర్’ అంటూ ఖాకీ చొక్కా ధరించారు. లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. తెలుగు, తమిళం భాషల్లో విడుదల కానుంది. తదుపరి బోయపాటి దర్శకత్వంలో సినిమాకి పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. బోయపాటి అంటే ఇక మాస్‌కి పెట్టింది పేరు. ఈ చిత్రమూ అలాంటి అంశాలతోనే ఉంటుందని సినీవర్గాలు చెబుతున్నాయి.
Nithin Macharla movie: నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ అంటూ కాస్త పొలిటికల్ టచ్ ఇస్తూనే మరోసారి మాస్ మంత్రం జపిస్తున్నారు. నాని ‘దసరా’ అంటూ నాటు అవతారం ఎత్తనున్నారు.
రవితేజ, గోపీచంద్, నానిలాంటి హీరోలైతే పక్కా మాస్ కథలతో సందడి చేస్తుంటారు. ఇప్పుడు మరోసారి వాళ్లు ఆ తరహా కథలే చేస్తున్నారు.
అవీ ఇవీ...
Chiranjeevi upcoming movies: తెలుగులో అగ్ర తారలకి అభిమానగణం ఎక్కువ. అందరినీ మెప్పించే అంశాలతో సినిమాలు చేసినా.. మధ్య మధ్యలో ‘ఇది అభిమానుల కోసమే’ అంటూ ఓ కథని ఎంచుకోవాలి. అప్పుడే వాళ్లకైనా, అభిమానులకైనా తృప్తి. చిరంజీవి ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్నారు. ఒక సినిమాలో రాజకీయం, మరో సినిమాలో సెంటిమెంట్, మరో చిత్రంలో సామాజికాంశాలు... ఇలా కథలేవైనా అందులో మాస్ తప్పనిసరి. ఆయన బాబీ దర్శకత్వంలో చేస్తున్న 154వ చిత్రం అభిమానుల కోసమే అన్నట్టుగా ప్రత్యేకమైన కొలతలతో ముస్తాబవుతోంది. కొత్త కథలు ఎంచుకునే Nagarjuna Balakrishna latest movies: నాగార్జున ‘బంగార్రాజు’గా తనలోని నాటు అవతారాన్ని మరోసారి చూపించారు. బాలకృష్ణ ‘అఖండ’ తర్వాత మళ్లీ మాస్ కథనే చేస్తున్నారు. వెంకటేష్ అప్పుడప్పుడూ ఆ తరహా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.
మాస్ కథలంటే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ ఇష్టమే. కాకపోతే కొంచెం కొత్తగా చెప్పాలి. యువ కథానాయకులైన మేం ఆ తరహా ప్రయత్నాలు ఎక్కువగా చేయలేమేమో కానీ, సీనియర్ హీరోలకి ఆ అవకాశం ఇప్పటికీ ఉంది. అందుకే ఆ కథలతో ప్రభావం చూపిస్తూనే ఉన్నారంటారు' నాగ చైతన్య.
ఇదీ చూడండి: Prabhas: ప్రభాస్‌తోనే పాన్‌వరల్డ్ సినిమా సాధ్యం: కృష్ణంరాజు