ETV Bharat / sitara

'హ్యాపీడేస్' సినిమా బాధితులైతే ఇదే నా సలహా... - నిఖిల్ సిద్ధార్థ్​

వివాహం త‌ర్వాత త‌న జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదని యువ క‌థానాయ‌కుడు నిఖిల్ సిద్ధార్థ్​ పేర్కొన్నారు. లాక్​డౌన్​ కారణంగా ఇంటికే పరిమితమైన ఆయన.. తాజాగా అభిమానులతో ముచ్చటించారు. గ‌త ఏడాది 'అర్జున్ సుర‌వ‌రం'తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు.

nikil latest conversation on twitter with fans
'హ్యాపీడేస్' బాధితులైతే ఆయన్నే అగడండి!
author img

By

Published : Jun 21, 2020, 8:00 PM IST

పెళ్లి తర్వాత తన జీవితంలో అనూహ్యంగా మార్పులేవి జరగలేదని చెప్పారు టాలీవుడ్​ యువ హీరో నిఖిల్. ఆయ‌న గ‌త ఏడాది 'అర్జున్ సుర‌వ‌రం'తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు. ఈ సినిమా మంచి టాక్ అందుకుంది. ఆ తర్వాత 'కార్తికేయ 2' షూటింగ్ ఆరంభించారు. లాక్‌డౌన్ కార‌ణంగా షూటింగ్ తాత్కాలికంగా ఆగిపోయింది. నిఖిల్ మేలో త‌న ప్రేయ‌సి ప‌ల్లవి వ‌ర్మ‌ను వివాహం చేసుకున్నారు. క‌రోనా కార‌ణంగా అత్యంత స‌న్నిహితుల స‌మ‌క్షంలో ఫాంహౌస్‌లో శుభ‌కార్యం జ‌రిగింది. కాగా ఆయ‌న తాజాగా ట్విట్టర్​ వేదిక‌గా అభిమానుల‌తో ముచ్చ‌టించారు. ఈ సంద‌ర్భంగా ఓ అభిమాని వైవాహిక జీవితం ఎలా ఉంద‌ని ప్ర‌శ్నించారు. దీనికి ఆయ‌న స్పందిస్తూ.. చాలా సంతోషంగా ఉన్నా. '‌ఎటువంటి మార్పులు లేవు. ఇప్ప‌టికీ పాత నిఖిల్ లానే ఉన్నా' అని స‌మాధానం ఇచ్చారు.

nikil latest conversation on twitter with fans
నిఖిల్​, పల్లవి

వెన్నెల కిశోర్ గురించి చెప్పండి?

నిఖిల్‌: హాస్యాస్ప‌దం.. ఆరోగ్యంపై జాగ్ర‌త్త‌లు తీసుకుంటుంటాడు. రియ‌ల్ లైఫ్‌లో చాలా ఫిట్‌గా ఉంటాడు.

ద‌క్షిణాదిలో మీకు ఇష్ట‌మైన ఆహారం?

నిఖిల్‌: గుంటూరు బిర్యానీ.

'కార్తికేయ 2'లో కూడా స‌ర్పం ఉంద‌‌ట‌..?

నిఖిల్‌: స‌ర్పాలు ఉంటాయి.

ప్ర‌భాస్ గురించి ఒక్క‌మాట చెప్పండి?

నిఖిల్‌: మా ప్ర‌భాస్ భాయ్ బంగారం

మీకు స్ఫూర్తి ఎవ‌రు?

నిఖిల్‌: అందులో సందేహం లేదు.. మెగాస్టార్ చిరంజీవి. చిన్న‌ప్పుడు గ్యాంగ్‌లీడ‌ర్ సినిమా చూసి స్కూల్‌లో డైలాగ్‌లు చెప్పేవాడ్ని.

మీకు పెంపుడు కుక్క‌లు లేవా?

నిఖిల్‌: ఇంత వ‌ర‌కు లేవు. కానీ నాకు ఓ బాబు పుట్టినప్పుడు తెచ్చుకుంటా.

మీ అభిమానుల గురించి ఒక్క‌మాట చెప్పండి?

నిఖిల్‌: నా ఆక్సిజ‌న్‌. విజ‌యం, అప‌జ‌యాల్లో నాకు అండ‌గా ఉన్నం‌దుకు ధ‌న్య‌వాదాలు.

నిఖిల్​

యువత ఎలా ఉండాలి, స‌ల‌హాలు ఇవ్వండి?

నిఖిల్‌: యువ‌త‌కు అవి చెప్ప‌కూడ‌దు. వాళ్ల‌కి ఉత్త‌మంగా ఉండ‌టం తెలుసు. మీ ల‌క్ష్యాల్ని సాధించేందుకు కృషి చేస్తూ.. కుటుంబ స‌భ్యులు సంతోషంగా ఉండేలా చూసుకోండి.

మీ మిత్రుడు ఎవ‌రు?

నిఖిల్‌: ద‌ర్శ‌కుడు చందూ మొండేటి.

'హ్యాపీడేస్' చూసి చాలా మంది బీటెక్ జీవితం ఇంత బాగుంటుందా అని బీటెక్ చేశారు. కానీ ఆపై సినిమా చూసి మోస‌పోయాం అనుకున్నారు. ఇలాంటివి విన్న‌ప్పుడు మీ ఫీలింగ్ ఏంటి?

నిఖిల్‌: ఈ ప్రశ్న నా ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ కమ్ముల‌ను అడ‌గండి.

మీకు ఇష్ట‌మైన వెబ్ సిరీస్‌?

నిఖిల్‌: నాకు గేమ్స్ ఆఫ్ థ్రోన్స్ ఇష్టం.

నాని గురించి?

నిఖిల్‌: ఎంతో నైపుణ్యం ఉన్న న‌టుడు.

మీకిష్ట‌మైన హాలిడే స్పాట్‌?

నిఖిల్‌: ల‌ండ‌న్‌.. అక్క‌డి ఎమిరేట్స్ స్టేడియం ఫుట్‌బాల్ మ్యాచ్ చూడ‌టం ఇష్టం.

నెపోటిజం గురించి చెప్పండి?

నిఖిల్‌: నెపోటిజం ప్ర‌తి చోటా, ప్ర‌తి రంగంలో ఉంది. కేవ‌లం శ్ర‌మించే వ్య‌క్తులు, నైపుణ్యం ఉన్న వారు స్టార్స్ కాగ‌ల‌రు.

మీకిష్ట‌మైన న‌టి?

నిఖిల్‌: భూమిక‌. ‘ఖుషి’లో ఆమె చ‌క్క‌గా ఉంటారు, న‌టించారు.

వ‌దిన ఎలా ఉంది?

నిఖిల్‌: ఆమె చాలా సంతోషంగా ఉంది. నా ప‌నుల్లో సాయం చేస్తోంది.

కేటీఆర్, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌ గురించి?

నిఖిల్‌: ‌మోడ్రన్ మేధావి.. అద్భుత‌‌మైన నటుడు.. తెలివి, నైపుణ్యం ఉన్న న‌టుడు. ఆయ‌న ప‌ట్ల గ‌ర్వంగా ఉంది.

షూటింగ్స్ మిస్ అవుతున్నారా?

నిఖిల్‌: ‌చాలా...

నెపోటిజం మీ కెరీర్‌పై ప్ర‌భావం చూపిందా?

నిఖిల్‌: నిజంగా లే‌దు. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ నాకు స్వాగతం చెప్పిం‌ది. ఇక్క‌డి కుటుంబంలో నేను ఒక్క‌డ్ని కావ‌డం గ‌ర్వంగా ఉంది.

యువహీరో నిఖిల్​

ప‌వ‌న్ క‌ల్యాణ్, చ‌ర‌ణ్‌ గురించి చెప్పండి?

నిఖిల్‌: ఆయ‌న ఓ పైట‌ర్‌. ఆయ‌న‌కు ఎప్పటికీ అభిమానినే. రామ్‌చ‌రణ్ గొప్ప వ్య‌క్తి. ప్ర‌తి ఒక్క‌రి గురించి ఆలోచిస్తారు.

మీ జీవితంలో గొప్ప రోజు?

నిఖిల్‌: 'అర్జున్ సుర‌వ‌రం' ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో చిరంజీవిగారు నా గురించి మాట్లాడ‌టం.

లాక్‌డౌన్‌లో కొత్త విష‌యాలు నేర్చుకుంటున్నారా?

నిఖిల్‌: త‌ర్వాతి రెండు ప్రాజెక్టులు ‘కార్తికేయ 2’, ‘18పేజెస్’ కోసం ప‌నిచేస్తున్నా. కొత్త‌గా ఫిల్మ్‌మేకింగ్ క్లాసులు వింటున్నా. గ‌త మూడు నెలలుగా శిక్ష‌ణ తీసుకుంటున్నా.

'కార్తికేయ 2'తో సూప‌ర్‌హిట్ అందుకోవాలి. ఆల్ ది బెస్ట్‌.

నిఖిల్‌: అదంతా చందూ మొండేటి చేతుల్లో ఉంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.