ETV Bharat / sitara

వెంటిలేటర్​పై 'కరణం మల్లీశ్వరి' దర్శకురాలు! - వెంటిలేటర్​పై కరణం మల్లీశ్వరి దర్శకురాలు

దర్శకురాలు సంజనా రెడ్డి అస్వస్థత కారణంగా ఆస్పత్రిలో చేరారు. డైట్​లో ఉండటం వల్ల బలహీనతకు గురైనట్లు నిర్మాత కోన వెంకట్ తెలిపారు.

సంజనా
సంజనా
author img

By

Published : Jun 9, 2020, 11:13 AM IST

Updated : Jun 9, 2020, 11:34 AM IST

యువ దర్శకురాలు సంజనారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఇంట్లో కళ్లు తిరిగి పడిపోవడం వల్ల ఆమెను కుటుంబసభ్యులు సోమాజిగూడలోని యశోదా ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆమె ప్రస్తుతం వెంటిలేటర్​పై చికిత్స పొందుతున్నారన్న వార్తలపై స్పందించారు నిర్మాత, రచయిత కోనా వెంకట్.

"ఆమె కొంతకాలంగా డైట్​లో ఉంది. కొద్దిరోజులుగా లిక్విడ్ ఫుడ్ మాత్రమే తీసుకుంటోంది. దానివల్ల బలహీనతకు గురైంది. అంతే తప్ప వేరే కారణం ఏమీ లేదు. త్వరలోనే ఆమె డిశ్చార్జ్ అవుతుంది." అని కోనా చెప్పారు.

యువ నటుడు రాజ్ త‌రుణ్‌తో తెరకెక్కించిన 'రాజుగాడు'తో ద‌ర్శ‌కురాలిగా ప‌రిచ‌య‌మైంది సంజన. ఆ సినిమా అనుకున్న ఫలితాన్ని సాధించలేదు. ఇటీవలే కరణం మల్లీశ్వరి బయోపిక్​ను రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. కోనా వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

Last Updated : Jun 9, 2020, 11:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.