తమిళనాడులో పోలీసుల అమానుష చర్యల కారణంగా జయరాజ్, అతని కుమారుడు ఫెనిక్స్ మృతిచెందడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో ఆగ్రహజ్వాలలు రేకెత్తుతున్నాయి. వారిరువురికి న్యాయం జరగాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా, కొందరు బాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.
ఈ వార్త తనకు ఎంతగానో కోపం తెప్పించిందని బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా అన్నారు. న్యాయం కోసం అందరూ కలిసికట్టుగా గొంతుకను వినిపించాలని ట్విట్టర్ వేదికగా ప్రజలను కోరారు. నేరం చేసింది ఎవరైనా శిక్ష పడి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు.
-
#JusticeForJayarajandBennicks pic.twitter.com/vGi8m63If2
— PRIYANKA (@priyankachopra) June 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#JusticeForJayarajandBennicks pic.twitter.com/vGi8m63If2
— PRIYANKA (@priyankachopra) June 26, 2020#JusticeForJayarajandBennicks pic.twitter.com/vGi8m63If2
— PRIYANKA (@priyankachopra) June 26, 2020
ఈ ఘటనకు సంబంధించి యానిమేటెడ్ పోస్టర్ను పంచుకున్న టైగర్ ష్రాఫ్.. నిందితులను గొలుసు లేని జంతువులుగా వర్ణించారు. దిశా పటానీ కూడా ఇదే తరహా చిత్రాన్ని పోస్ట్ చేసి.. చాలా విచారంగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కచ్చితంగా న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. తాప్సీ, కియరా అడ్వాణీ, జెనీలియా తదితరులు ఈ హేయమైన చర్యను తీవ్రంగా ఖండించారు.
-
This might just be one case out of many but it takes only one case to begin the snowball effect. #JusticeforJayarajAndFenix
— taapsee pannu (@taapsee) June 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
It could’ve been anyone we know. Details are scary and gut wrenching.
">This might just be one case out of many but it takes only one case to begin the snowball effect. #JusticeforJayarajAndFenix
— taapsee pannu (@taapsee) June 26, 2020
It could’ve been anyone we know. Details are scary and gut wrenching.This might just be one case out of many but it takes only one case to begin the snowball effect. #JusticeforJayarajAndFenix
— taapsee pannu (@taapsee) June 26, 2020
It could’ve been anyone we know. Details are scary and gut wrenching.
-
I am so so shocked and pained and to a large extent just unsure, how we have become such a horrible race.. This incident is so brutal, it actually breaks my heart.. Just not done💔💔 #JusticeforJayarajAndFenix https://t.co/YoMxSo8jW5
— Genelia Deshmukh (@geneliad) June 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">I am so so shocked and pained and to a large extent just unsure, how we have become such a horrible race.. This incident is so brutal, it actually breaks my heart.. Just not done💔💔 #JusticeforJayarajAndFenix https://t.co/YoMxSo8jW5
— Genelia Deshmukh (@geneliad) June 26, 2020I am so so shocked and pained and to a large extent just unsure, how we have become such a horrible race.. This incident is so brutal, it actually breaks my heart.. Just not done💔💔 #JusticeforJayarajAndFenix https://t.co/YoMxSo8jW5
— Genelia Deshmukh (@geneliad) June 26, 2020
అసలేం జరిగిందంటే...
లాక్డౌన్ కారణంగా విధించిన ఆంక్షలను ఉల్లంఘిస్తూ.. తమ మొబైల్ షాపును సమయానికి మూసేయలేదనే కారణంతో జయరాజ్, అతని కుమారుడు ఫెనిక్స్లపై జున్ 19న పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం జ్యుడిషియల్ కస్టడీలో ఉంచగా.. జూన్22 రాత్రి జయరాజ్, ఫెనిక్స్ 23న మరణించారు. పోలీసులు తీవ్రంగా హింసించడం వల్లే వారు చనిపోయారని మృతుల కుటుంబసభ్యులు ఆరోపించారు.
ఈ క్రమంలోనే పోస్ట్మార్టం వీడియో రికార్డు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు పోలీసు అధికారులను సస్పెండ్ చేసినట్లు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి తెలిపారు.
ఇదీ చూడండి:'అక్కడ జార్జి ఫ్లాయిడ్.. ఇక్కడ జయరాజ్-ఫెనిక్స్'