ETV Bharat / sitara

అభిమానులకు గుడ్​న్యూస్​.. ఒకే తెరపై ఖాన్​ త్రయం! - sharukh salman aamir khan in one movie

బాలీవుడ్ ఖాన్ త్రయం సల్మాన్, షారుఖ్, ఆమిర్​లు కలిసి పనిచేయనున్నారని తెలిసింది. ఆమిర్​ ప్రధాన పాత్రలో నటిస్తోన్న 'లాల్ సింగ్ చద్ధా'లో వీరు ముగ్గురు కనిపిస్తారని సినీ వర్గాల టాక్.

three khans
ఖాన్​ త్రయం
author img

By

Published : Nov 21, 2020, 8:56 AM IST

బాలీవుడ్​లో ఖాన్ త్రయానికి అభిమానుల్లో ఎంత క్రేజ్​ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరి సినిమాలు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. వీరికి సంబంధించి ఏదైన సినిమా విడుదలైందంటే ఆ రోజు ఫ్యాన్స్​కు పండగే. అయితే ఈ ముగ్గురు హీరోలు కలిసి ఇప్పటివరకు ఒకే తెరపై కనిపించింది లేదు. కానీ వీరి కలయికలో ఓ మల్టీస్టారర్ చిత్రం​ వస్తే బాగుంటుందని ఎప్పుటినుంచో అభిమానులు ఆశిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇలాంటి వార్త ఒకటి బాలీవుడ్​లో చక్కర్లు కొడుతోంది.

ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'లాల్ సింగ్ చద్ధా'. హాలీవుడ్​లో వచ్చిన 'ఫారెస్ట్ గంప్'​ ఆధారంగా తెరకెక్కుతోంది. 'సీక్రెట్ సూపర్​ స్టార్'​ ఫేం అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇందులో ఆమిర్​తో పాటు కీలక పాత్రల్లో సల్మాన్​, షారుక్​​ కూడా నటిస్తున్నారని తెలిసింది. దీనిపై చర్చలు కూడా జరిగాయని సమాచారం. మరి ఇదే కనుక నిజమైతే ముగ్గురు ఖాన్​లను ఒకే తెరపై చూడాలన్న సినీప్రేక్షకుల కల తీరుతుంది. ప్రస్తుతం 'లాల్ సింగ్ చద్ధా' చిత్రీకరణ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది డిసెంబరులో ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశముంది.

ఇదీ చూడండి :

థియేటర్లలోనే సల్మాన్​, రణ్​వీర్, అక్షయ్ సినిమాలు

881 రోజుల తర్వాత.. చిత్రీకరణలో పాల్గొన్న షారుక్​!​

బూడిద రంగు హెయిర్​స్టైల్​తో ఆమిర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.