ధనుష్ కథానాయకుడిగా గౌతమ్ వాసుదేవ్ మేనన్ దర్శకత్వంలో తెరకెక్కిన అనువాద చిత్రం 'తూటా'. మేఘా ఆకాష్ కథానాయిక. ఈ సినిమాకు జి.తాతారెడ్డి, జి.సత్యనారాయణ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ మీడియా సమావేశంలో ఈ చిత్ర నిర్మాతలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
తమిళంలో విజయవంతమైన ఈ సినిమా కథ, సాంకేతికత ప్రేక్షకుల్ని అలరించిందని తెలిపారు. ఇప్పుడు తెలుగులో కూడ ఈ మూవీని తీసుకొస్తున్నాం. కచ్చితంగా వారికి నచ్చే చిత్రమిది. ధనుష్ నటన, గౌతమ్ వాసుదేవ్ మేనన్ దర్శకత్వం సినిమాకు ప్రధాన బలం. ధనుష్‌కు తెలుగులో మంచి మార్కెట్ ఉంది.
తూటా నిర్మాతలు
ఇటీవల విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: 'యూపీ వాడికి తెలుగువాడు యముడిలా కనిపిస్తున్నాడా'