తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు, సినిమాలతో వార్తల్లో నిలిచే ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మొదటిసారి ఓ ప్రేమ పాటకు ఫిదా అయ్యారు. పాట సూపర్‌గా ఉందంటూ ట్వీట్ చేశారు. సునీల్ కీలకపాత్రలో నటిస్తున్న చిత్రం 'కనబడుటలేదు'. వైశాలీరాజ్, సుక్రాంత్, హిమజ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం త్వరలో 'స్పార్క్' ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో 'కనబడుటలేదు' నుంచి 'తొలిసారి నేనే' అనే పాటను కాజల్ విడుదల చేశారు. ఈ అందమైన మెలోడిని విడుదల చేయడం తనకెంతో ఆనందంగా ఉందని ఆమె తెలిపారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
అయితే, ఈ పాట లిరికల్ వీడియోను షేర్ చేసిన ఆర్జీవీ చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి బాలరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సునీల్ మర్డర్ మిస్టరీని ఛేదించే గూఢాచారిగా సీరియస్ లుక్‌లో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
'హీరో' ట్రైలర్
ఇతర భాషల్లో విజయం అందుకున్న చిత్రాల్ని ప్రముఖ ఓటీటీ 'ఆహా' డబ్ చేసి తెలుగు ప్రేక్షకులకు వినోదం పంచుతోంది. ఈ క్రమంలోనే కన్నడ సినిమా 'హీరో'ను అదే పేరుతో జులై 24 నుంచి అందుబాటులోకి తీసుకురానుంది. రిషబ్ శెట్టి కథానాయకుడిగా దర్శకుడు ఎం.భరత్ రాజ్ తెరకెక్కించిన చిత్రమిది. గనవి లక్ష్మణ్ నాయిక. ప్రమోద్ శెట్టి ప్రతినాయకుడు. ఈ నేపథ్యంలో సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'దట్టమైన అడవులతో నిండిన లంక ఇది' అనే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఉత్కంఠ పెంచుతూనే నవ్వులు పంచుతుంది. ఇందులో బార్బర్‌గా కనిపించాడు కథానాయకుడు. క్షౌరం చేసేందుకు విలన్ ప్రమోద్ ఇంటికి వెళ్తాడు రిషబ్. ప్రమోద్ భార్య (కథానాయిక), రిషబ్‌కు మధ్య పరిచయం ఉండటం వల్ల ఇద్దరూ దగ్గరవుతారు. అదే సమయంలో విలన్ కంట పడతారు. విలన్ గ్యాంగ్‌తో 'హీరో' పోరాటాలు, ఛేజింగులు మొదలవుతాయి. చివరిలో 'నువ్వు వచ్చిన పని ముగించకుండానే వెళ్తావా' అని హీరోను హీరోయిన్ అడగటం ఉత్కంఠ పెంచింది. దాంతో ఇంతకీ హీరో పగకు కారణమేంటి? అనే సందేహం కలుగుతుంది. కథానాయకుడు.. కథానాయిక గొంతు కోసే సన్నివేశం మరో ట్విస్ట్. నటీనటుల హావభావాలు ఆకట్టుకుంటున్నాయి. నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలిచింది. మరి 'హీరో' పగ ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఇదీ చూడండి.. పోర్న్ చిత్రాలతో కుంద్రా సంపాదన రోజుకు రూ.8 లక్షలు?