ETV Bharat / sitara

ఈ స్టార్స్​ తొలి జీతం వందల్లో.. ఇప్పుడు కోట్లలో!

author img

By

Published : May 24, 2021, 5:46 PM IST

ఈ స్టార్​ నటులు ప్రస్తుతం ఒక్కో సినిమాకు కోట్లలో రెమ్యునరేషన్​ తీసుకుంటున్నారు. అయితే వీరు సినీ పరిశ్రమలోకి రాకముందు నెల జీతం కోసం సగటు ఉద్యోగిలా పనిచేశారు. కేవలం వందల్లో మాత్రమే జీతాన్ని అందుకున్నారు. అలాంటి వారిలో ఓ ఐదుగురు బాలీవుడ్ స్టార్స్ గురించే ఈ కథనం.

This was the first salary of these Bollywood celebs and here's how much they earn now
మూవీ న్యూస్

బాలీవుడ్​లో నిలదొక్కుకోవడం అంటే సాధారణ విషయం కాదు. అభిమానులకు నచ్చేలా సినిమా తీస్తూనే, ఇతర హీరోల పోటీని తట్టుకుంటూ నెగ్గుకురావాలి. ఇప్పుడున్న కొంతమంది స్టార్స్ ఇలానే చాలా కష్టాలు పడితే గానీ ఈ స్థాయికి రాలేకపోయారు. ఇప్పుడు కోట్లలో రెమ్యునరేషన్​ తీసుకుంటున్న ఈ తారలు.. తొలి జీతం వందల్లో తీసుకున్నారంటే మీరు నమ్మగలరా? అవును మీరు విన్నది నిజమే. ఈ నేపథ్యంలోనే అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, ఆమిర్​ఖాన్, ప్రియాంకా చోప్రా.. తొలి జీతం ఎంత తీసుకున్నారు? ఇప్పుడెంత తీసుకుంటున్నారో చూద్దాం.

అక్షయ్ కుమార్

హీరోగా ఏడాదికి నాలుగు సినిమాలకు తగ్గకుండా చేస్తున్న అక్షయ్ కుమార్.. బాలీవుడ్​లో అత్యధిక రెమ్యునరేషన్​ తీసుకుంటున్న హీరోల్లో ఒకరు. ప్రస్తుతం ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కోసం రూ.120 కోట్లు అందుకుంటున్నారు. అయితే నటుడు కాకముందు బ్యాంకాక్​లో చెఫ్, వెయిటర్​గా పనిచేశారు అక్షయ్. నెలకు రూ.1500 జీతం మాత్రమే తీసుకున్నారు.

akshay kumar first salary
అక్షయ్ కుమార్

అమితాబ్ బచ్చన్

భారతీయ సినిమా.. లవ్​స్టోరీలు, రొమాంటిక్​ హీరోలతో ఉన్న కాలంలో 'జంజీర్'తో​ యాంగ్రీ యంగ్ మ్యాన్​గా ఎంట్రీ ఇచ్చారు బిగ్​బీ అమితాబ్ బచ్చన్. నటన, గానం, రచన, డ్యాన్స్.. ఇలా ఏదైనా సరే తాను రెడీ అంటూ ముందుకొచ్చారు. తనకు ఏ పాత్ర ఇచ్చినా సరే, అందుకు తగ్గట్లుగా తనను తాను మార్చుకుని వావ్ అనిపించారు. అయితే వీటి కంటే ముందు కోల్​కతాలోని షా& వాల్ష్ కంపెనీలో రూ.500 జీతానికి ఎగ్జిక్యూటివ్​గా అమితాబ్ పనిచేసినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా గతంలో పేర్కొంది. ఫ్రీప్రెస్ జర్నల్ తెలిపిన ప్రకారం బిగ్​బీ ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.18-20 కోట్లు తీసుకుంటున్నారు.

amitabh bachchan first salary
అమితాబ్ బచ్చన్

ఆమిర్​ఖాన్

బాలీవుడ్​లో మిస్టర్ ఫర్​ఫెక్షనిస్ట్ అంటే గుర్తొచ్చే పేరు ఆమిర్​ఖాన్. బయోపిక్​లు, సందేశాత్మక చిత్రాల్లో నటిస్తూ అలరిస్తున్న ఆయన.. నటుడిగా నెలకు రూ.1000 లెక్కన తొలి జీతం అందుకున్నారు. 'ఖయామత్ సే ఖయామత్ తక్' కోసం దాదాపు ఏడాది పాటు పనిచేసిన ఆమిర్.. రూ.11 వేలు తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ఫిల్మ్​ఫేర్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

aamir khan first salary
ఆమిర్ ఖాన్

షారుక్​ఖాన్

బాలీవుడ్​లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్న కింగ్ షారుక్​ఖాన్.. హీరోగా, నిర్మాతగా, పారిశ్రామికవేత్తగా సత్తా చాటుతున్నారు. అయితే నటుడిగా కెరీర్​ మొదలుపెట్టకముందు 'పంకజ్ ఉదాస్ కన్సర్ట్'లో ఉషార్​గా(దారి చూపేవాడు) పనిచేశారు షారుక్. ఈ క్రమంలో తొలి జీతంగా రూ.50 అందుకున్నారు. ఇప్పుడు మాత్రం తన కొత్త సినిమా కోసం రూ.100 కోట్లు తీసుకుంటున్నారట.

shahrukh khan fisrt salary
షారుక్ ఖాన్

ప్రియాంకా చోప్రా

బాలీవుడ్​లో సాధారణ నటిగా కెరీర్​ ప్రారంభించిన ప్రియాంకా చోప్రా.. ప్రస్తుతం హాలీవుడ్​లో సినిమాలు, టీవీ సిరీస్​లు చేస్తూ బిజీగా మారిపోయింది. 2000లో మిస్​ వరల్డ్ కిరీటం గెల్చుకున్న తర్వాత చేసిన తొలి ప్రాజెక్టుకు రూ.5000 జీతంగా అందుకుంది ప్రియాంక. ఈ ప్రముఖ ఛానెల్ కథనం ప్రకారం ఇన్​​స్టా​లో ఒక్క పోస్టు పెట్టేందుకు రూ.1.80 కోట్లు తీసుకుంటున్న ప్రియాంక.. ఒక్కో సినిమాకు రూ.22 కోట్ల రెమ్యునరేషన్​ అందుకుంటోంది.

priyanka chopra

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.