శుక్రవారం వచ్చిందంటే చాలు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా సినిమా బాగుంటే చూసేందుకు సిద్ధమవుతారు. అలాంటి వారి కోసం ఈ శుక్రవారం ఏకంగా పది సినిమాలు రాబోతున్నాయి. విశేషమేమిటంటే కబీర్ సింగ్ మినహా మిగతావన్నీ చిన్న సినిమాలే కావడం. ఇందులో తెలుగువి ఏడు, అనువాద సినిమాలు మూడు.
- అర్జున్ రెడ్డి రీమేక్‌గా రూపొందిన 'కబీర్ సింగ్'లో షాహిద్ కపూర్, కియారా అడ్వాణీ జంటగా నటించారు
- ఆసు యంత్రం కనిపెట్టిన చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'మల్లేశం'. ప్రముఖ హాస్య నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్ర పోషించాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- విద్యావ్యవస్థపై వ్యంగ్యాస్త్రాలతో రూపుదిద్దుకున్న సినిమా 'ఫస్ట్ ర్యాంక్ రాజు'. చేతన్ మద్దినేని హీరోగా నటించాడు.
- హాస్యభరితంగా తెరకెక్కిన చిత్రం 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ'. నవీన్ పోలిశెట్టి కథానాయకుడిగా నటించాడు.
- అడ్డంకుల్ని దాటుకుని విడుదలకు సిద్ధమైన సినిమా 'ఓటర్'. మంచు విష్ణు, సురభి హీరో హీరోయిన్లు. రాజకీయ కథాంశంతో చిత్రాన్ని రూపొందించారు.
- నటుడు అజయ్ ప్రధాన పాత్రలో.. పోలీస్‌గా నటించిన సినిమా 'స్పెషల్'. వాస్తవ్ దర్శకుడు
- క్రైమ్ థ్రిల్లర్‌గా తీసిన 'స్టువర్టుపురం'.. ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది.
- హరినాథ్ పోలిచర్ల స్వీయ దర్శకత్వంలో వస్తున్న 'కెప్టెన్ రాణా ప్రతాప్' సినిమా ఆర్మీ కథాంశంతో తెరకెక్కింది.
- తమిళంలో ఆర్య నటించిన 'గజేంద్రుడు'. చింపాంజీ ప్రధాన పాత్రధారిగా తీసిన 'గొరిల్లా'.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇలా అన్ని సినిమాలు ఒకేరోజు రావడం వల్ల నిర్మాతలకు లాభం కన్నా నష్టమే ఎక్కువని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏది చూడాలో తెలియక ప్రేక్షకులు గందరగోళానికి గురవుతారు.
ఇది చదవండి: రాజుగారి గది-3లో తమన్నా భయపెడుతుందా..!