టాలీవుడ్లో క్రీడల నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. కబడ్డీ, క్రికెట్‌తో పాటు బాక్సింగ్ నేపథ్యంలోనూ పలు చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించాయి. తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'గని'తో పాటు విజయ్ దేవరకొండ 'లైగర్' కూడా బాక్సింగ్ నేపథ్యంతో తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలో తెలుగులో బాక్సింగ్ కథతో వచ్చిన చిత్రాలపై ఓ లుక్కేద్దాం.
గని
మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న కొత్త చిత్రం 'గని'. తాజాగా వరుణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌ను మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ విడుదల చేశారు. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి సహా జగపతిబాబు, నవీన్ చంద్ర కీలకపాత్రలు పోషిస్తున్నారు. సయీ మంజ్రేకర్ కథానాయిక. ఈ ఏడాది జులైలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
లైగర్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతోన్న సినిమా 'లైగర్'. ఇందులో బాక్సర్‌గా రౌడీ హీరో కనిపించనున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం విజయ్.. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. ఇందులో విజయ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్యా పాండే హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీసీ కనెక్ట్స్, ధర్మా ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పాన్ఇండియా స్థాయిలో సినిమాను విడుదల చేయనున్నారు.
తమ్ముడు
పవన్ కల్యాణ్, ప్రీతి జింగానియా ప్రధానపాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'తమ్ముడు'. అరుణ్ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పవన్ బాక్సర్‌గా కనిపిస్తారు. ప్రారంభం నుంచి బాక్సర్ కాకపోయినా తన అన్నకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి బాక్సింగ్ నేర్చుకుని విలన్‌ను మట్టికరిపిస్తాడు హీరో. ఇందులోని 'లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ద మిర్రర్' అనే సాంగ్ పూర్తి నిడివి ఆంగ్ల గీతంగా తెరకెక్కించారు. ఇది ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పాటలో ఛాతిపై రాతి పలకను పగలగొట్టించుకోవడం, నీటితో నింపిన కుండలను కాలితో బద్దలు కొట్టడం, కొబ్బరికాయను చేతితో పగలగొట్టడం, చేతిపై నుంచి కారు నడిపించుకోవడం వంటి స్టంట్లను పవన్ వాస్తవంగా చేసి చూపించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
గురు
విక్టరీ వెంకటేశ్, రితికా సింగ్ ప్రధానపాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'గురు'. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఎవ్వరినీ లెక్కచెయ్యకుండా, బాక్సింగే సర్వస్వంగా భావిస్తూ తనకు నచ్చినట్టు ప్రవర్తించే ఇండియన్ ఉమెన్స్ బాక్సింగ్ టీమ్ కోచ్ పాత్రలో వెంకీ ఆకట్టుకున్నారు. రితికా సింగ్ ఇతడికి శిష్యురాలిగా మెప్పించింది. కూరగాయలు అమ్ముకునే రామేశ్వరి (రితికా సింగ్)ని ఆదిత్య (వెంకటేశ్) వరల్డ్ ఛాంపియన్‌గా ఎలా తీర్చిదిద్దాడు అనేది కథాంశం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి
రవితేజ, ఆసిన్ ప్రధానపాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి'. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రవితేజ బాక్సర్‌గా కనిపించారు. జయసుధ, ప్రకాశ్‌రాజ్ కీలకపాత్రలు పోషించారు. భార్యాభర్తలైన జయసుధ, ప్రకాశ్‌రాజ్ కొన్ని కారణాల వల్ల విడిపోతారు. తర్వాత బాక్సింగ్ కోచ్ అయిన తన తండ్రి (ప్రకాశ్ రాజ్) వద్దే కోచింగ్ తీసుకుని తన చెల్లిని మోసం చేసిన సుబ్బరాజును ఓ మ్యాచ్‌లో రవితేజ ఎలా ఓడించాడనేది కథాంశం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
జై
నవదీప్, సంతోషి, తనికెళ్ల భరణి, దువ్వాసి మోహన్, అభినయ శ్రీ తదితరులు ముఖ్యపాత్రాల్లో నటించిన సినిమా 'జై'. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహించారు. అనూప్ రుబెన్స్ అందించిన స్వరాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. చివర్లో పాకిస్థాన్ బాక్సర్‌ను నవదీప్ ఓడించే ఫైట్ అద్భుతంగా చిత్రీకరించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
తుంటరి
నారా రోహిత్, లతా హెగ్దే ప్రధానపాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'తుంటరి'. కుమార్ నాగేంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నారా రోహిత్ బాక్సర్‌గా కనిపించారు. ఈ సినిమా కథ విషయానికొస్తే.. కొంతమంది కార్పోరేట్ ఉద్యోగులు సెలవులకు ఓ హిల్ స్టేషన్‌కు వెళతారు. అక్కడ వాళ్లకు ఓ సన్యాసి కనిపించి తనకు భవిష్యత్తు తెలుసని చెబుతాడు. ఆ విషయాన్ని నమ్మించడానికి వాళ్లకు నాలుగు నెలల తరువాత రాబోయే న్యూస్ పేపర్ ఇస్తాడు. ఆ పేపర్ చదివిన వాళ్లకు రాజు(రోహిత్) అనే వ్యక్తి ద్వారా వాళ్లు బాక్సింగ్ పోటీల్లో నెగ్గి 5 కోట్లు గెలుచుకుంటారని తెలుస్తుంది. దీంతో రాజును వెతుక్కుంటూ వెళ్లిన ఆ ఉద్యోగులు చివరికి అతన్ని వైజాగ్‌లో కనుక్కుని అతడిని బాక్సింగ్ పోటీలకు ఒప్పిస్తారు. మొదట్లో అల్లరి చిల్లరిగా తిరిగే రాజు ఎలా బాక్సింగ్ పోటీలకు ఒప్పుకుంటాడు? అసలు బాక్సింగే రాని అతను ఆ పోటీని ఎలా గెలుస్తాడు? అనేదే ఈ సినిమా కథ.
- " class="align-text-top noRightClick twitterSection" data="">