కరోనా వైరస్‌తో పోరాడి.. తిరిగి ఆరోగ్యవంతమైన జీవితంలోకి ఇటీవలే అడుగుపెట్టింది నటి తమన్నా. ప్రస్తుతం వృత్తిపరమైన పనుల్లో బిజీ అయిపోయింది. అయితే కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సమయంలో తాను ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొవాల్సి వచ్చిందనే విషయాన్ని ఈ మధ్యే వెల్లడించింది.
'నాకు కొవిడ్ పాజిటివ్‌గా తేలినప్పుడు ఎంతో భయపడ్డాను. చికిత్స తీసుకుంటున్నప్పుడు చనిపోతాననే ఆలోచనలు ఎక్కువగా వచ్చాయి. కరోనాకు సంబంధించి తీవ్రమైన లక్షణాలు కనిపించాయి. కానీ, వైద్యులే నన్ను బతికించారు. క్లిష్ట పరిస్థితుల్లో ఎంతో సపోర్ట్‌గా ఉన్న నా తల్లిదండ్రులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. జీవితం ఎంత విలువైందో నాకు తెలిసింది. వైరస్ నుంచి కోలుకునే సమయంలో వైద్యులు ఇచ్చిన మందుల వల్ల నేను కొంచెం లావుగా మారాను. ఇటీవల సోషల్‌మీడియా వేదికగా ఓ ఫోటో షేర్ చేస్తే.. అది చూసి 'లావుగా ఉన్నావు' అన్నారు. ఒకరి గురించి కామెంట్ చేసేటప్పుడు.. అసలు ఆ వ్యక్తికి ఏమైంది? అనేది ఆలోచించకుండా వారిలో ఉన్న లోపాలు మాత్రమే వెతుకుతుంటారనే విషయం అప్పుడు నాకు అర్థమైంది' అని తమన్నా వివరించారు.
తమన్నా ప్రస్తుతం 'సీటీమార్', 'అంధాదున్' రీమేక్‌తో పాటు 'గుర్తుందా శీతాకాలం' సినిమాల్లో నటిస్తోంది.
ఇది చదవండి: తమన్నా-సత్యదేవ్‌ల లవ్‌స్టోరీ మొదలు