సహజమైన అందానికి, అభినయానికి చిరునామా సాయిపల్లవి. తెరపై ఆమె కనిపించే విధానం చూస్తుంటే మన ఇంట్లో మనిషినో.. పక్కింటి పిల్లనో చూస్తున్నట్లుగా అనిపిస్తుంటుంది. ఆమె తొలి చిత్రం 'ప్రేమమ్' నుంచి ఆ మధ్య వచ్చిన 'పడిపడి లేచే మనసు' వరకు ప్రతి చిత్రంలోనూ ఈ తరహా సహజత్వం నిండిన పాత్రలతోనే అలరించింది.
'ఫిదా'తో
తెలుగులో ఆమె తొలి సినిమా 'ఫిదా' అయితే మరింత ప్రత్యేకం. తనకది తొలి చిత్రమే అయినప్పటికీ తెలంగాణ గడుసు పిల్లలా కనబర్చిన హావభావాలు, తెలంగాణ యాసలో పలికిన సంభాషణలు సినీప్రియుల మదిలో చెరగని ముద్ర వేశాయి. ఇటీవలే సాయిపల్లవి.. 'ఫిదా' గురించి మాట్లాడుతూ అందులోని ఓ సన్నివేశం గురించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. తాను ట్రాక్టర్ నడిపిన సన్నివేశం తన జీవితంలోనే అత్యంత క్లిష్టమైన ఎపిసోడ్ అంది.
"ట్రాక్టర్‌ను మామూలుగా నేర్చుకోని బయట నడపడం వేరు.. వ్యవసాయ క్షేత్రంలో బురద నేలలో నడపడం వేరు. 'ఫిదా'లో బురద నేలలోనే నడిపా. ఆ సమయంలో అలా ట్రాక్టర్ నడుపుతూ.. సహజ సిద్ధమైన హావభావాలతో నటించడానికి చాలా కష్టపడ్డా. ఆ ఎపిసోడ్ పూర్తి చేసే క్రమంలో చాలాసార్లు నియంత్రణ కోల్పోయా. నా కెరీర్‌లోనే అత్యంత కష్టంగా అనిపించిన సన్నివేశం అది" అని చిత్రీకరణ రోజులను గుర్తుచేసుకుంది.
ప్రస్తుతం రానా సరసన 'విరాటపర్వం'లో నటిస్తోందీ భామ. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి: సెట్లో ప్రభాస్ అలా ఉంటాడు: పూజా హెగ్డే