ETV Bharat / sitara

'గాడ్​ ఫాదర్​'గా మెగాస్టార్​ చిరంజీవి! - చిరంజీవి లూసిఫర్​ రిమేక్​

చిరంజీవి 'లూసీఫర్' రీమేక్ ఈనెల 13 నుంచి హైదరాబాద్​లో చిత్రీకరణ మొదలు కానున్నట్లు సమాచారం. విభిన్నమైన పొలిటికల్​ యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందనున్న ఈ సినిమా కోసం 'గాడ్​ ఫాదర్​' అనే టైటిల్​ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

Chiranjeevi Lucifer remake
చిరంజీవి లూసిఫర్​ రిమేక్​
author img

By

Published : Aug 4, 2021, 7:29 AM IST

చిరంజీవి 'లూసీఫర్' రీమేక్​కు రంగం సిద్ధమవుతోంది. ఈనెల 13 నుంచి హైదరాబాద్​లో చిత్రీకరణ మొదలు కానుంది. ఇందుకోసం భాగ్యనగరంలో ఓ ప్రత్యేక సెట్​ను సిద్ధం చేస్తున్నారు. ఆ సెట్​లోనే తొలి షెడ్యూల్​ ప్రారంభం కానుంది. విభిన్నమైన పొలిటికల్​ యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందనున్న ఈ సినిమా కోసం 'గాడ్​ ఫాదర్​' అనే టైటిల్​ పరిశీలిస్తున్నట్లు సమాచారం. దాదాపుగా ఇదే పేరు ఖరారయ్యే అవకాశముందని చిత్ర సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది.

చిరు పుట్టినరోజు సందర్భంగా ఆగష్టు 22న చిత్ర టైటిల్​తో పాటు ఫస్ట్​లుక్​ను విడుదల చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి నటిస్తున్న 153వ చిత్రమిది. దీనికి తమన్​ స్వరాలందిస్తున్నారు. మోహన్ రాజ దర్శకుడు. రామ్​ చరణ్​తో కలిసి ఎన్వీ ప్రసాద్​ నిర్మిస్తున్నారు.

ఇదీ చదవండి:'గూఢచారి 2' వచ్చేస్తోంది.. అడవి శేష్​ క్లారిటీ

'సూపర్ డీలక్స్​' తెలుగు ట్రైలర్‌ వచ్చేసింది..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.