ETV Bharat / sitara

'బాలీవుడ్​ స్పందన అనవసరం.. త్వరలోనే సిరీస్​గా 'ది కశ్మీర్​ ఫైల్స్​''

The Kashmir Files: ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది 'ది కశ్మీర్​ ఫైల్స్​'. ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు అనూహ్య అదరణ లభిస్తోంది. అయితే దీని గురించి బాలీవుడ్​ పెద్దగా స్పందించకపోవడంపై దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా గురించి తన వద్ద ఉన్న సమాచారంతో ఓ సిరీస్​ను రూపొందిస్తానని తెలిపారు.

The Kashmir Files
Vivek Agnihotri
author img

By

Published : Mar 15, 2022, 5:00 PM IST

Updated : Mar 16, 2022, 1:55 AM IST

The Kashmir Files: చిన్న సినిమాగా మొదలై సంచలనంగా మారిన 'ది కశ్మీర్​ ఫైల్స్'​ గురించి బాలీవుడ్​ నుంచి స్పందన లేకపోవడంపై దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి స్పందించారు. అది అంత ముఖ్యం కాదని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ అంశం గురించి తన వద్ద చాలా సమాచారం ఉందని, త్వరలోనే దీనిపై ఓ సిరీస్​ను​ రూపొందించనున్నట్లు వెల్లడించారు.

"భారత్​ మారుతోంది. పాత వ్యవస్థలు దిగివచ్చి, కుప్పకూలుతున్నాయి. సినిమాలోనూ అందుకు సంబంధించి ఓ సన్నివేశం ఉంది. 'అధికార పీఠంపై ఎవరున్నా.. వ్యవస్థ మాత్రం మాదే (నడిపించేది మేమే)' అని పల్లవి జోషీ చెప్పే ఓ డైలాగ్​ ఉంది. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి చివరి దశకు చేరుకుంది. ఎందుకంటే.. వాస్తవాలు, నిజాలు బయటకు వస్తున్నాయి. కశ్మీర్​ ఫైల్స్​ అనేది వాస్తవం. అది నిజమైన వ్యక్తులకు జరిగిన విషాదం. బాలీవుడ్​ మాట్లాడకపోతేనేం? దీని గురించి ప్రజలు మాట్లాడుతున్నారు."

- వివేక్ అగ్నిహోత్రి, దర్శకుడు

కంగనా, అక్షయ్ ప్రశంసలు..

సినిమాలో పుష్కర్​నాథ్​ పండిట్​గా నటించిన సీనియర్​ నటుడు అనుపమ్​ ఖేర్​ కూడా.. "బాలీవుడ్​ అని కాదు.. ఇవి నిజమైన కథలు. దీని గురించి ఎవరు మాట్లాడినా, మాట్లాడకపోయినా ఫర్వాలేదు." అని అన్నారు. అయితే కంగనా రనౌత్, బాలీవుడ్​ స్టార్​ హీరో అక్షయ్ కుమార్, దర్శకుడు మధుర్ భండార్కర్​ వంటివారు ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

త్వరలోనే సిరీస్​గా..

ఈ సినిమా కోసం పరిశోధన చేయడానికే తనకు, తన బృందానికి నాలుగేళ్లు పట్టిందని తెలిపారు వివేక్. బాధిత కశ్మీర్​ పండిట్​లను నేరుగా కలిసి మాట్లాడినట్లు చెప్పారు. "మా దగ్గర ఉన్న సమాచారంతో మేము ఒక సిరీస్​నే తీయవచ్చు. అన్నీ హృదయాన్ని ద్రవింపజేసేవే. వాటి గురించి ఎవరికీ తెలియదు. ఈ ఆలోచనతో సినిమా మొదలుపెట్టినప్పుడు.. ఇలాంటి ఘటనలు కశ్మీరీ హిందువులకు జరిగాయంటే ఎవరూ నమ్మలేదు. ఈ అంశంపై ఓ సిరీస్​ రూపొందించాలనే ఆలోచనలో ఉన్నాం." అని వివేక్ వెల్లడించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

పెరుగుతున్న ఆదరణ..

'ది కశ్మీర్​ ఫైల్స్'​ను జీ స్టూడియోస్​ సంస్థ నిర్మించింది. అనుపమ్ ఖేర్​, దర్శన్​ కుమార్​, మిథున్ చక్రవర్తి, పల్లవి జోష్​ అద్భతంగా నటించి తమ పాత్రల్లో జీవించారు. 1990లో కశ్మీర్​ పండిట్​లపై జరిగిన హింసాకాండ, మారణహోమానికి సంబంధించిన పరిస్థితులను కళ్లకుగట్టారు. దీంతో సినిమా చూసిన ప్రతిఒక్కరు భావోద్వేగానికి గురవుతున్నారు. మార్చి 11న విడుదలైన ఈ సినిమాకు నానాటికీ ఆదరణతో పాటు కలెక్షన్లు పెరుగుతున్నాయి.

ఇదీ చూడండి: ట్యాక్స్ ఫ్రీ.. ఉద్యోగులకు లీవ్.. టాప్​ రేటింగ్స్​.. 'కశ్మీర్​ ఫైల్స్' ఎందుకింత

Last Updated : Mar 16, 2022, 1:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.