ఉత్తర్‌ప్రదేశ్ బరేలీకి చెందిన 40 ఏళ్ల గోవర్ధన్ భోజ్వాణీ ఏటా కర్వాచౌత్ పర్వదినాన అమితాబ్ బచ్చన్ కోసం ఉపవాస దీక్ష చేస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 14 ఏళ్లుగా ఇలా తన అభిమానాన్ని చాటుతూ వస్తున్నారు ఈ బిగ్ బీ ఫ్యాన్.
నీ వెంటే నేనుంటా!
గోవర్ధన్ గుండెల్లోనే కాదు, రూపంలోనూ బిగ్‌బీ ప్రతిబింబిస్తారు. గడ్డం, వేషధారణ సర్వం బచ్చన్ నుంచి ప్రేరణపొందినవే. ఆలోచనల్లోనూ ఆయన్నే అనుసరిస్తారు ఈయన. అడుగడుగునా అమితాబ్‌ను ఆరాధిస్తారు.
2005లో బాక్సాఫీస్‌ను కుదిపేసిన సినిమా 'బాఘ్బాన్' చూసి బిగ్‌బీ పట్ల అపారమైన ప్రేమ పెంచుకున్నారు భోజ్వాణీ. అప్పటి నుంచే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాను అంటున్నారు ఆయన.
"అమితాబ్ బచ్చన్ సూత్రాలు మాతో పాటు కలకాలం ఉండాలి. మాకు మర్గదర్శకంగా నిలవాలి. ఆయన్నుంచి మరెన్నో మంచి మాటలు నేర్చుకోవాలని కోరుతూ నేను కర్వాచౌత్ వ్రతం ఆచరిస్తాను. బాఘ్బాన్ సినిమాలో కూడా ఆయన ఇదే చెప్పారు. భార్య కోసం భర్త కూడావ్రతం చేయాలన్నారు. అందుకే నేను నా భార్య కోసం, మా అమితాబ్ కోసం వ్రతం చేస్తాను."
-గోవర్ధన్ భోజ్వాణీ