ETV Bharat / sitara

13 ఎకరాల్లోని ఆ సినిమా సెట్​ కూల్చివేత! - Maidan movie latest update

అజయ్​ దేవగణ్​ 'మైదాన్​' సినిమాకు సంబంధించిన భారీ సెట్​ను కూల్చివేయాలని చిత్రబృందం నిర్ణయించింది. లాక్​డౌన్​ కారణంగా దీని నిర్వహణ ఖర్చు పెరిగిపోతుండమే కారణమని సినీవర్గాలు టాక్.

The demolition of the Maidan cinema setting, spread over 13 acres
13 ఎకరాల్లో ఉన్న 'మైదాన్​' భారీ సెట్​ కూల్చివేత!
author img

By

Published : May 31, 2020, 1:48 PM IST

బాలీవుడ్​ సినిమా 'మైదాన్' కోసం ముంబయిలో వేసిన భారీ సెట్​ను కూల్చేయనున్నారు. లాక్​డౌన్ వల్ల నిరుపయోగంగా మారడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. వర్షాకాలం వచ్చేలోపు ఈ పని పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఈ విషయాన్ని నిర్మాత బోనీ కపూర్ కూడా ధ్రువీకరించారు. మళ్లీ ఇలాంటి సెట్​ను రూపొందించాలంటే కనీసం రెండు నెలలైనా పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఫుట్‌బాలర్ అబ్దుల్‌ సయీద్‌ రహీం జీవితం ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారు. అమిత్‌ శర్మ దర్శకుడు. ఫుట్‌బాల్‌కు స్వర్ణయుగంగా చెప్పుకునే 1952-1962 మధ్యే ఈ కథంతా ఉండనుంది. ఇందులో ప్రియమణి, గిరిజ రావు కీలక పాత్రలు పోషిస్తున్నారు. షెడ్యూల్​ ప్రకారం ఈ ఏడాది డిసెంబర్‌ 11న విడుదల కావాల్సి ఉంది. కరోనా వల్ల అదికాస్త ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

కరోనా‌ వల్ల ఇప్పటికే చాలా సినిమాల షూటింగ్‌లతో పాటు సెట్స్ పనికిరాకుండా పోయాయి. కథానాయకుడు అక్షయ్‌ కుమార్‌ నటిస్తున్న చారిత్రక చిత్రం 'పృథ్వీరాజ్'‌ సెట్టింగులను కూల్చివేయనున్నారని సమాచారం. నిర్వహణ వ్యయం పెరుగుతుండం వల్లే ఈ నిర్ణయాలవైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి... పాక్​తో ఆ మ్యాచ్​ కోహ్లీ కెరీర్​లోనే 'గేమ్​ ఛేంజర్​'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.