ETV Bharat / sitara

'సీటీమార్​' విడుదల వాయిదాకు కారణమిదే! - తమన్నా

కబడ్డీ నేపథ్యంతో తెరకెక్కిన 'సీటీమార్' చిత్రం విడుదల వాయిదా పడింది. పోస్ట్​ ప్రొడక్షన్​ వర్క్స్​ కారణంగా రిలీజ్​ను వాయిదా వేస్తున్నట్లు దర్శకుడు సంపత్​ నంది ప్రకటించారు. అయితే దీని వెనుక మరో కారణం ఉందని టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది.

reason behind Seetimaarr's postponement
సీటీమార్​
author img

By

Published : Mar 28, 2021, 2:11 PM IST

కథానాయకుడు గోపీచంద్ హీరోగా నటించిన 'సీటీమార్' చిత్ర విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని దర్శకుడు సంపత్ నంది సోషల్ మీడియాలో శనివారం వెల్లడించారు. పోస్ట్ ప్రొడక్షన్​లో ఆలస్యం కావడం, ప్రేక్షకులకు చిత్రంతో మంచి అనుభూతి ఇవ్వాలనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే అందుకు మరో కారణం ఉందని టాలీవుడ్​లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

సినిమాలోని విజువల్​ ఎఫెక్ట్స్​పై నిర్మాణసంస్థ, దర్శకుడు సంతృప్తి చెందని కారణంగా చిత్ర విడుదలను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. తొలుత ఏప్రిల్​ 2న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం నిర్ణయించింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సినిమా కొత్త రిలీజ్​ డేట్​ను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది.

ఈ చిత్రంలో గోపీచంద్ సరసన తమన్నా హీరోయిన్​గా నటించింది. వీరిద్దరూ కబడ్డీ కోచ్​ల పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతమందించగా, శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వ్యవహరించారు.

ఇదీ చూడండి: 'వకీల్​సాబ్​' ట్రైలర్​ అప్​డేట్​.. రికార్డుల మోతే ఇక?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.