ETV Bharat / sitara

'తలైవి' సాంగ్​ అప్​డేట్​.. 'వై' ట్రైలర్​ రిలీజ్​ - తలైవి ఇలా ఇలా సాంగ్

కొత్త సినిమా కబుర్లు వచ్చేశాయి. ఇందులో 'తలైవి'లో తొలి సాంగ్​ రిలీజ్​ సహా 'వై' చిత్ర ట్రైలర్​ అప్​డేట్లు ఇందులో ఉన్నాయి.

Thalaivi's first song, Y telugu movie trailer released
'తలైవి' సాంగ్​ అప్​డేట్​.. 'వై' ట్రైలర్​ రిలీజ్​
author img

By

Published : Mar 31, 2021, 8:15 PM IST

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితకథతో రూపొందిన పాన్ ఇండియా చిత్రం 'తలైవి'. ఎ. ఎల్. విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలో కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుంటోంది. ఇటీవలే విడుదలైన చిత్ర ట్రైలర్​కు విశేషాదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో సినిమాలోని 'ఇలా ఇలా' పాటను ఏప్రిల్​ 2న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

Thalaivi's first song, Y telugu movie trailer released
'తలైవి' సాంగ్​ అప్​డేట్

శ్రీకాంత్‌, రాహుల్‌ రామకృష్ణ కీలకపాత్రల్లో నటిస్తున్న థ్రిల్లర్‌ మూవీ 'వై'. బాలు అడుసుమిల్లి దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా 'ఆహా' ఓటీటీ వేదికగా ఏప్రిల్‌ 2న విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో చిత్ర ట్రైలర్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో శ్రీకాంత్‌ సినిమా దర్శకుడిగా కనిపించారు. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన 'వై' ట్రైలర్​ను మీరూ చూసేయండి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: జాన్వీకి సవాలైన పాత్ర ఇది: బోనీ కపూర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.