ETV Bharat / sitara

సినీడైరీ: ఎర్రసముద్రాన్ని అద్భుతంగా చీల్చారు

గ్రాఫిక్స్​ అంతగా లేని 50వ దశకంలోనే హాలీవుడ్ చిత్రం టెన్ కమాండ్​మెంట్స్​లో అద్భుతమైన విజువల్స్​ను తెరపై చూపించాడు దర్శకుడు. ముఖ్యంగా ఎర్రసముద్రాన్ని చీల్చే సన్నివేశం ప్రేక్షకులను కట్టిపడేసింది.

టెన్​కమాండ్​మెంట్స్​
author img

By

Published : Jul 31, 2019, 10:08 AM IST

టెన్ కమాండ్​మెంట్స్.. 1956లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో విజువల్ వండర్​గా తెరకెక్కింది. సిసెల్ బి డీమెల్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమా అతడి ఊహకు అద్భుత సృష్టి. గ్రాఫిక్స్​ అంతగా లేని ఆ రోజుల్లోనే ఎర్రసముద్రాన్ని రెండుగా చీల్చే సన్నివేశంతో ప్రేక్షకులకు విజువల్​ ట్రీట్​ ఇచ్చాడు. అప్పట్లోనే వంద కోట్లకు పైగా ఖర్చుపెట్టి తీసిన ఈ చిత్రం అంతకు పదింతల వసూళ్లను రాబట్టింది.

సముద్రాన్ని ఇలా చీల్చారు...

ఈ సీన్​కోసం దర్శకుడు ఎంతో శ్రమించాడట. హాలీవుడ్​లో వేసిన ప్రత్యేక సెట్​లో.. సముద్రం రెండుగా చీలినట్లుగా చూపించేందుకు పెద్ద ట్యాంకుల్లోంచి దాదాపు మూడు లక్షల గ్యాలన్ల నీటిని వినియోగించారు. నీరు పై నుంచి పోస్తూ.. ఫిల్మ్​ ఫుటేజిని రివర్స్​లో రన్ చేశారట. సముద్రపునీరుగా కనిపించేందుకు ట్యాంకుల్లో జిలాటిన్​ను కలిపారట. కెమెరా టెక్నిక్స్​, కొద్దిపాటి గ్రాఫిక్స్​తో తెరపై వీక్షించిన ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేశారు.

క్రీస్తుపూర్వం ఎక్సోడస్ అనే పుస్తకం ఆధారంగా టెన్​ కమాండ్​మెంట్స్​ చిత్రాన్ని తీశారు. ఈ సినిమా ఎంత విజయం సాధించిందంటే ఉత్తమ పది అమెరికా చిత్రాల్లో చోటు దక్కించుకుంది. ఏడు ఆస్కార్ అవార్డులకు నామినేటైంది. ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్​ విభాగంలో అకాడమీ అవార్డు దక్కించుకుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇది చదవండి: 'కలిసే వ్యక్తుల్ని బట్టి దారి దొరుకుతుంది'

Intro:Body:

ert

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.