తమిళ స్టార్ విజయ్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ తీస్తున్న చిత్రం 'బీస్ట్'(beast release date). కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే(pooja hegde movie) కథానాయిక. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. డిసెంబరు నాటికి చిత్రీకరణ పూర్తి చేయడమే లక్ష్యంగా చిత్ర బృందం శ్రమిస్తోంది. ఇప్పటికే మేజర్ షూట్ పూర్తయిందని, మరో 40రోజుల చిత్రీకరణ మిగిలి ఉందని సమాచారం. ఇందులో భాగంగా క్లైమాక్స్‌కు సంబంధించిన ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు మరికొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నట్లు తెలిసింది. విజయ్ శైలిలో సాగే మాస్ యాక్షన్ కథాంశంతో నెల్సన్ ఈ సినిమా ముస్తాబు చేస్తున్నారు.
అభిషేక్ బచ్చన్, నిత్యామేనన్ జంటగా నటించిన వెబ్ సిరీస్ 'బ్రీత్'(breathe season 2). ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమైన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు దీనికి కొనసాగింపుగా మరో కొత్త సీజన్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది 'బ్రీత్' బృందం. మయాంక్ శర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ కొత్త సీజన్ తాజాగా దిల్లీలో చిత్రీకరణ ప్రారంభించుకుంది. ఈ కొత్త 'బ్రీత్' సీజన్ 2022లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
అక్షయ్ కుమార్ హీరోగా రోహిత్ శెట్టి తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ 'సూర్యవంశీ'(sooryavanshi release date). శక్తిమంతమైన పోలీస్ కథాంశంతో రూపొందింది. కత్రినా కైఫ్ కథానాయిక. రణ్ వీర్ సింగ్, అజయ్ దేవగణ్ అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్లోనే సినీప్రియుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం.. కరోనా పరిస్థితుల వల్ల వాయిదా పడింది. శుక్రవారం నుంచి మహారాష్ట్రలో పూర్తిస్థాయిలో థియేటర్లు తెరచుకుంటున్న నేపథ్యంలో.. చిత్ర బృందం విడుదల విషయమై స్పష్టత ఇచ్చింది. ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా నవంబర్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని అక్షయ్ ట్విటర్ వేదికగా అభిమానులకు తెలియజేశారు. గురువారం ఈ సినిమా నుంచి "అయిలా రే అయిలా" అనే గీతాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పాటకు సంబంధించిన ప్రోమో పోస్ట్ చేశారు.
కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటిస్తున్న సినిమా 'రాజా విక్రమార్క'(raja vikramarka karthikeya). తాన్యా రవిచంద్రన్ కథానాయిక. శ్రీ సరిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. రామారెడ్డి నిర్మాత. నవంబర్ 12న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సుధాకర్ కోమాకుల, సాయి కుమార్, తనికెళ్ల భరణి తదితరులు నటించారు.
ఇవీ చదవండి: