Vishwak sen news: కరోనా ప్రభావం ఇటీవల కాలంలో మళ్లీ పెరుగుతుంది. ప్రతిరోజూ వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. సామాన్యుల నుంచి పలువురు సెలబ్రిటీల వరకు దీని బారిన పడుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్లో పలువురు నటీనటులకు పాజిటివ్‌గా తేలింది. ఇప్పుడు టాలీవుడ్‌లోనూ ఎఫెక్ట్ పడింది. యువహీరో విశ్వక్సేన్కు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని అతడు ఇన్‌స్టా వేదికగా వెల్లడించారు.
తనకు కొవిడ్-19 సోకినట్లు నిర్ధరణ అయిందని, ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నట్లు విశ్వక్సేన్ తెలిపారు. వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ కొత్త వేరియెంట్ చాపకింద నీరులా వ్యాపిస్తుందని రాసుకొచ్చారు. అందరూ మాస్క్ పెట్టుకోవడం సహా జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు.
ఇటీవల 'పాగల్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విశ్వక్సేన్.. ప్రస్తుతం 'అశోకవనంలో అర్జున కల్యాణం' సినిమా చేస్తున్నారు. షూటింగ్ జరుగుతుంది. అలానే 'ఓరి దేవుడా!' సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. తమిళ సినిమా 'ఓ మై కడవులే'కు రీమేక్‌గా దీనిని తెరకెక్కించారు. మిథిలా పాల్కర్ హీరోయిన్గా నటించింది.
ఇవీ చదవండి: