ETV Bharat / sitara

'ఆర్ఆర్ఆర్​'కు సర్కారు గుడ్​న్యూస్.. టికెట్ రేట్ల పెంపునకు ఓకే - rrr movie ticket rates telangana

RRR movie ticket rates hike: ఆర్ఆర్ఆర్ సినిమాకు... టికెట్ల రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించింది తెలంగాణ సర్కారు. ఎంతమేర పెంచుకోవచ్చనే విషయంపై ప్రకటన జారీ చేసింది. అదేసమయంలో రోజుకు ఐదు ఆటలు ప్రదర్శించుకునేందుకు అనుమతించింది.

rrr movie ticket rates hike
rrr movie ticket rates hike
author img

By

Published : Mar 19, 2022, 12:58 PM IST

Updated : Mar 19, 2022, 3:14 PM IST

RRR movie ticket rates hike: దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాకు తెలంగాణ సర్కారు శుభవార్త చెప్పింది. రోజుకు ఐదు ఆటలు ప్రదర్శించుకునేందుకు అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు టికెట్ రేట్ల ధరలు పెంచుకునేందుకూ అనుమతించింది. ఎంతమేర పెంచుకోవచ్చనే విషయంపై ప్రకటన జారీ చేసింది.

ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. సినిమా విడుదలైన తర్వాత మూడు రోజుల వరకు ఏసీ థియేటర్లలో టికెట్​పై రూ.50 అధికంగా వసూలు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏడు రోజుల వరకు రూ.30 చొప్పున పెంచుకోవచ్చు. మల్టీప్లెక్స్ థియేటర్స్, ఐమాక్స్ థియేటర్​లలో మొదటి 3 రోజులు రూ. 100 తర్వాత వారం రోజులు రూ. 50 పెంచుకునే అవకాశం ఉంది. నాన్ ఏసీ థియేటర్ల విషయంలో రేట్ల పెంపు లేదని సర్కారు స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 7 నుంచి రాత్రి ఒంటి గంట మధ్య థియేటర్లలో ఐదు ఆటలు ప్రదర్శించుకునే వెసులుబాటు కల్పించింది.

ఏపీలో ఇలా...

ఏపీ ప్రభుత్వం ఇప్పటికే రేట్ల పెంపునకు అనుమతించింది. అన్ని రకాల టికెట్లపై అదనంగా రూ.75 మేర వసూలు చేసుకునేందుకు అనుమతినిచ్చింది. సినిమా విడుదల తేదీ నుంచి 10 రోజులపాటు పెంచిన ధరలు వర్తిస్తాయని హోమ్ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.

రూ.450 కోట్ల భారీ బడ్జెట్​తో రూపొందిన ఈ చిత్రంలో రామ్​చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్​గా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్​ హీరోయిన్లు. అజయ్​ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. డీవీవీ దానయ్య నిర్మాత.

ఇదీ చదవండి: మహేశ్ 'పెన్నీ సాంగ్'​లో సితార స్టెప్పులు... ప్రియాంక 'ముద్దుల హోలీ'

Last Updated : Mar 19, 2022, 3:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.