కరోనా వల్ల చాలా సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. థియేటర్లు ఓపెన్ అయినప్పటికీ కొన్ని కారణాలు వల్ల ఈ ప్లాట్‌ఫాంలోనే విడుదల అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నాని నటించిన కొత్త సినిమా 'టక్ జగదీశ్' కూడా ఓటీటీ విడుదలకు సిద్ధమైంది!
ఈ క్రమంలోనే థియేటర్స్‌ను కాపాడాలంటూ ఆగస్టు 20న ఫిలించాబర్లో జరిగిన సమావేశంలో ఓటీటీ రిలీజ్‌లను ఎగ్జిబిటర్లు తప్పుబట్టారు. ఇందులో భాగంగా 'టక్ జగదీశ్' సినిమాను ప్రస్తావిస్తూ.. ఈ చిత్ర నిర్మాతలు తమ నిర్ణయంపై పునరాలోచించుకోవాలని కోరారు. నాని సినిమాలను ఇకపై థియేటర్లలో విడుదల చేయమని అన్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో శనివారం దీనిపై స్పందించిన థియేటర్స్ అసోసియేషన్.. తాము ఎవరినీ వ్యక్తిగతంగా టార్గెట్ చెయ్యలేదని, తమ ఉద్దేశం అది కాదని తెలిపింది. ఎగ్జిబిటర్లు తమ మాటలతో ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించండి అంటూ ఓ ప్రెస్ నోట్‌ను విడుదల చేసింది.
కాగా, ఇటీవల తన సపోర్ట్ ఎప్పుడూ థియేటర్లకు ఉంటుందని అన్నాడు నాని. 'టక్ జగదీశ్' రిలీజ్ విషయం నిర్మాతల ఇష్టం అని చెప్పాడు.
ఇదీ చూడండి: 'టక్ జగదీశ్' ఓటీటీ విడుదలపై ఎగ్జిబిటర్ల ఆందోళన