బాలీవుడ్ హీరోయిన్లు కంగన రనౌత్, తాప్సీ పన్ను మధ్య కొంతకాలంగా మాటల యుద్ధం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. సామాజిక మాధ్యమాల వేదికగా ఒకరిని ఒకరు విమర్శించుకుంటూ ఉంటారు. అయితే.. తాజాగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఒకరిపై ఒకరు పొగడ్తలు కురిపించుకున్నారు. ఇంతకీ ఏమైందంటే.. ఇటీవల ఫిల్మ్‌ఫేర్ పురస్కారాల ప్రదానోత్సవం జరింగింది. 'తప్పడ్' సినిమాలో తన నటనకు గానూ తాప్సీ ఉత్తమ నటి విభాగంలో అవార్డు సొంతం చేసుకుంది. అవార్డు అందుకున్న సందర్భంగా వేదికపై తాప్సీ మాట్లాడింది. ఈక్రమంలోనే తనతో పాటు నామినేట్ అయిన కంగన, దీపిక పదుకొణె, జాన్వీ కపూర్, విద్యాబాలన్‌ను ఆమె ప్రశంసించింది. అద్భుతమైన నటనతో తనకు ఒక బెంచ్‌మార్కును సెట్ చేసినందుకు కంగనకు కృతజ్ఞతలు చెప్పింది. దీనికి సంబంధించి వీడియోను తాప్సీ సోషల్ మీడియాలో పంచుకుంది. కాగా.. తాప్సీ వీడియోపై కంగన కూడా స్పందించింది. తాప్సీకి ధన్యవాదాలు చెప్పడం సహా ఈ అవార్డు అందుకోవడానికి నీకంటే అర్హులు మరెవరూ లేరంటూ తాప్సీపై ప్రశంసలు కురిపించింది.
-
We know deep down sasti is #KanganaRanaut fan ✌🏻@KanganaTeam pic.twitter.com/1YHYYMUo67
— Bipin SPk (@Bipin64805424) April 9, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">We know deep down sasti is #KanganaRanaut fan ✌🏻@KanganaTeam pic.twitter.com/1YHYYMUo67
— Bipin SPk (@Bipin64805424) April 9, 2021We know deep down sasti is #KanganaRanaut fan ✌🏻@KanganaTeam pic.twitter.com/1YHYYMUo67
— Bipin SPk (@Bipin64805424) April 9, 2021
తాప్సీ ప్రస్తుతం స్పోర్ట్స్ డ్రామా 'శెభాష్ మిథూ'లో నటిస్తోంది. భారత మహిళా క్రికెట్ సారథి మిథాలీ రాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. మరోవైపు ఆమె నటించిన 'రష్మీ రాకెట్', 'లూప్ లపేటా' చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కంగన సైతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'తలైవి'లో ఆమె ప్రధానపాత్ర పోషించింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితచరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ నెల 23న ఈ చిత్రం విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది.
ఇదీ చూడండి: తాప్సీపై మరోసారి కంగన ఘాటు వ్యాఖ్యలు!