డ్యాన్స్‌లు, పాటలతో కుర్రకారును ఉర్రూతలూగించగల మాస్హీరో, తనదైన శైలి నటనతో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న స్టార్, కోలీవుడ్‌లో రజనీకాంత్ తర్వాత స్టైల్‌కు కేరాఫ్ అడ్రస్.. ఇదంతా ఎవరి గురించో అర్థమైందిగా. అతడే ప్రముఖ కథానాయకుడు విజయ్ దళపతి. ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విజయ్‌కు తమిళనాట మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సినిమా విడుదలైందంటే అభిమానులకు పండగే. బక్సాఫీస్ వద్ద రికార్డుల సందడే. మంగళవారం(జూన్ 22) దళపతి పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు మీకోసం..
సినీ నేపథ్యం
విజయ్ తండ్రి చంద్రశేఖర్ ప్రముఖ దర్శకుడు. ఆయన దర్శకత్వంలోనే 1984లో 'వెట్రి' సినిమాతో బాలనటుడిగా వెండితెర అరంగేట్రం చేశారు విజయ్. ఆ తర్వాత పలు చిత్రాల్లోనూ నటించారు. 1992లో విడుదలైన 'నాలయ తీర్పు' సినిమాతో పూర్తిస్థాయి నటుడిగా మారారు. 1996లో రిలీజ్ అయిన 'పూవే ఉనక్కగా'తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలా అప్పటి నుంచి ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. 'పెళ్లి సందడి', 'అతనొక్కడే', 'బద్రి', 'ఒక్కడు', 'ఖుషీ', 'తమ్ముడు', 'పోకిరి' వంటి ఎన్నో తెలుగు హిట్ సినిమాలను రీమేక్ చేసి విజయం సాధించారు. త్వరలోనే నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 'బీస్ట్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
రూ.100కోట్లకు పైగా వసూలు
ఇటీవల కాలంలో విజయ్ నటించిన పలు సినిమాలు రూ.100కోట్లకు పైగా వసూలు చేశాయి. అందులో 'మాస్టర్', 'బిగిల్', 'మెర్సల్'(అదిరింది), 'సర్కార్', 'తేరి'(పోలీసోడు) వంటివి ఉన్నాయి.
ఆస్తి విలువ
భారతీయ చిత్రసీమలోని సంపన్న నటులలో విజయ్ దళపతి ఒకరు. ఆయన ఆస్తి విలువ ప్రస్తుతం రూ.410కోట్లు అని సమాచారం. 2019నుంచి ఆయన ఏడాదికి రూ.100-120కోట్లు సంపాదిస్తున్నారని తెలిసింది. విజయ్ పలు చిత్రాల్లో నటిస్తూనే బ్రాండ్ అంబాసిడర్‌గానూ సత్తా చాటుతున్నారు. కోకా కోలా, ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ సహా పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. వీటి ద్వారా ఏడాదికి రూ.10కోట్ల వరకు ఆర్జిస్తున్నారు.
రికార్డు పారితోషికం
భారీ రెమ్యునరేషన్ తీసుకునే నటుల్లో ఒకరిగా విజయ్ ఎదిగారు. ఇటీవల 'మాస్టర్' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఆయన.. ప్రస్తుతం నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో 'బీస్ట్' చిత్రంలో నటిస్తున్నారు. ఇందుకోసం రూ.100కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలిసింది. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. అనిరుధ్(Anirudh Ravichander) స్వరాలు సమకూరుస్తున్నారు. పూజా హెగ్డే(Pooja Hegde) కథానాయిక. విలన్ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్(Vidyut Jammwal)ను ఎంపిక చేసినట్లు సమాచారం.
విజయ్‌తో దిల్‌రాజు భారీ ప్లాన్
దలపతి విజయ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'స్నేహితుడు' తర్వాత ఆయన సినిమాలు దాదాపుగా తెలుగులో డబ్ అవుతూ, సినీ అభిమానుల్ని అలరిస్తూ వచ్చాయి. ఈ ఏడాది 'మాస్టర్'(Master) అంటూ వచ్చి ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. అయితే దిల్‌రాజు నిర్మాణంలో, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఆయన స్ట్రెయిట్ తెలుగు చిత్రం చేసేందుకు అంగీకారం తెలిపారు. రూ.170కోట్ల భారీ బడ్జెట్‌తో, పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కించనున్నారని తెలిసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు చిత్రబృందం త్వరలో అధికారికంగా వెల్లడించే అవకాశముంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఖరీదైన కార్లు
విజయ్‌కు కార్లంటే కూడా విపరీతమైన ఇష్టం!. ఆయన దగ్గర ఎన్నో ఖరీదైన విలాసవంతమైన కార్లు ఉన్నాయి. రోల్స్ రాయిస్ ఘోస్ట్(రూ.6కోట్లు), ఆడీ ఏ8(రూ.1.30కోట్లు), బీఎమ్‌డబ్ల్యూ సిరీస్5(రూ.75లక్షలు), బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్6(రూ.90లక్షలు), మినీ కూపర్(రూ.35లక్షలు) ఉన్నాయి.
64 సినిమాలు
విజయ్ ఫ్యాన్స్.. సోషల్‌మీడియాలో ఆయన కామన్ డీపీ, ఫ్యాన్ మేడ్ పోస్టర్లతో, ట్వీట్లతో ట్రెండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సెవెన్ స్క్రీన్ స్టూడియో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన నటించిన 64 సినిమాలు సహా రాబోతున్న కొత్త చిత్రం పోస్టర్‌తో కలిపి ఓ పోస్టర్‌ను తయారు చేసింది. అది నెట్టింట్లో ట్రెండింగ్‌గా మారింది.
ఇదీ చూడండి: Vijay 65: విజయ్ 'బీస్ట్'లుక్ వచ్చేసిందోచ్!