ETV Bharat / sitara

గుండెపోటుతో ప్రముఖ దర్శకుడు మృతి - గుండెపోటుతో దర్శకుడు జననాథన్​ మృతి

తమిళ దర్శకుడు ఎస్​పీ జననాథన్​(61) కన్నుమూశారు. గుండెపోటుతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరిన జననాథన్​.. చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు.

Tamil Director SP Jananathan passed away due to Cardiac arrest
గుండెపోటుతో ప్రముఖ దర్శకుడు మృతి
author img

By

Published : Mar 14, 2021, 12:47 PM IST

జాతీయ అవార్డు గ్రహీత తమిళ దర్శకుడు ఎస్​పీ జననాథన్​(61) కన్నుమూశారు. గుండెపోటుతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరిన జననాథన్​.. చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. దీంతో పలువురు సినీప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం విజయ్​ సేతుపతి ప్రధానపాత్రలో రూపొందుతోన్న 'లాభం' సినిమాకు దర్శకుడిగా జననాథన్​ వ్యవహరించారు.

ఎస్​పీ జననాథన్​.. 1959 మే 7న తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. 2003లో విడుదలైన 'అయ్యర్​కై' అనే తమిళ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ సినిమాకుగానూ ఉత్తమ ఫీచర్​ ఫిల్మ్​ విభాగంలో జాతీయ అవార్డు లభించింది. బీ లెనిన్​, భరథన్​, విన్సెంట్​ సెల్వ, కేయర్​ వంటి దర్శకుల వద్ద ఆయన సహాయదర్శకుడిగా పనిచేశారు.

జననాథన్​.. దర్శకుడిగానే కాకుండా, కథా రచయితగా, నిర్మాతగానూ రాణించారు. బైనరీ పిక్చర్స్​ అనే నిర్మాణం సంస్థ ద్వారా 'పురంపొక్కు ఎంగిర పొదువుదమై' అనే చిత్రాన్ని నిర్మించారు.

ఇదీ చూడండి: బాలీవుడ్​ నటుడు సిద్ధాంత్​ చతుర్వేదికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.