స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడుగా సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం 'పుష్ప'. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంతో సాగే కథలో పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు బన్ని. ఇందులో రష్మిక హీరోయిన్. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి మరో నాయిక నివేదా పేతురాజ్ పేరూ వినిపిస్తోంది. ఓ కీలక సన్నివేశం కోసం ఆమెను తీసుకోబోతున్నారని సమాచారం. కథకే ప్రధానంగా నిలిచే పాత్రలో ఆమెను ఎంపిక చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్నారని, త్వరలోనే స్పష్టత రానుందని టాక్.
'మెంటల్ మదిలో' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది నివేదా. అల్లుఅర్జున్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన 'అల వైకుంఠపురములో' తెరపై కనువిందు చేసింది. మరోసారి బన్నీతో కలిసి నటిస్తోందన్న వార్త అందరిలో ఆసక్తి పెంచుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవలే విడుదలైన 'పుష్ప' ఫస్ట్‌లుక్‌కు విశేష స్పందన లభించింది. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
ఇదీ చూడండి.. 'పుష్ప'లో కన్నడ నటుడు ధనంజయ్?