Thamannah news: మిల్కీబ్యూటీ తమన్నా.. ఓవైపు స్పెషల్ సాంగ్స్, మరోవైపు పెద్ద సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఈ క్రమంలోనే తన పెళ్లిపై ఇటీవల వస్తున్న ఆసక్తికర విషయాల్ని చెప్పింది.
ప్రస్తుతం తను సినిమాలతో తీరక లేకుండా ఉన్నానని చెప్పిన తమన్నా.. మరో రెండేళ్ల వరకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని తెలిపింది. కెరీర్ సాఫీగా సాగుతుందని, ఇలాంటి టైమ్‌లో పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదని పేర్కొంది. సమయం వచ్చినప్పుడు, అన్ని సవ్యంగా జరుగుతాయని చెప్పింది.
తమన్నా.. మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' సినిమాతో పాటు రెండు కన్నడ సినిమాల్లోనూ నటిస్తుంది. దటీజ్ మహాలక్ష్మి, ఎఫ్ 3, గుర్తుందా శీతాకాలం సినిమాల్లో హీరోయిన్గా చేస్తోంది. వరుణ్‌తేజ్ 'గని' చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో నర్తించింది.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇవీ చదవండి: