సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన తొలినాళ్లలో తాను చాలా సమస్యలు ఎదుర్కొన్నట్లు బాలీవుడ్ నటి తాప్సీ చెప్పింది. హీరోల భార్యలకు తాను నచ్చకపోవడం వల్ల సినిమాల్లో అవకాశాలు కోల్పోయినట్లు తాజాగా ఓ ఆంగ్ల మీడియాతో వెల్లడించింది.
"హీరో భార్యలకు నేను నచ్చకపోవడం వల్ల నేను అనేక సినిమా అవకాశాలు కోల్పోయాను. ఒక్కోసారి నేను చెప్పిన డైలాగ్ హీరోకు నచ్చకపోయినా దాన్ని మార్చేవారు. అందుకు నేను అంగీకరించకపోవడం వల్ల ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్‌తో డైలాగ్ మార్చి చెప్పించారు. హీరో ఇంట్రడక్షన్ కంటే నా పరిచయ సన్నివేశం బాగుంటే దాన్ని మార్చమని చెప్పిన హీరోలూ ఉన్నారు. నా ముందే ఇలాంటివి జరుగుతుంటే.. నా వెనుక మరెన్ని జరుగుతున్నాయో నాకు తెలియదు."
- తాప్సీ, బాలీవుడ్ నటి
తాను వెలుగులోకి రావడానికి ఇష్టపడని కొంతమంది హీరోలు ఉన్నారని తాప్సీ అంటోంది. ఈ విధంగా తాను అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ సినీ పరిశ్రమలో తన సుదీర్ఘ ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నట్లు తెలిపింది. తాప్సీ ప్రస్తుతం 'హసీన్ దిల్రూబా', 'రష్మీ రాకెట్', 'లూప్ లాపెటా' చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.