బాలీవుడ్ బ్యూటీ తాప్సీ నివాసానికి ఇటీవలే వచ్చిన రూ.36 వేల విద్యుత్ వినియోగ బిల్లు చర్చనీయాంశంగా మారింది. లాక్‌డౌన్ కారణంగా మూడు నెలలుగా బిల్లు తీయకుండా వాటన్నిటిని తాజాగా పంపారు. అన్ని శ్లాబులనూ కలిపి ఒక్క నెలలోనే ఈ మొత్తం సుంకాన్ని విధించారు. ఈ క్రమంలోనే సాధారణం కన్నా 10 రెట్లు అధికంగా బిల్లు వచ్చిందని తాప్సీ ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది. అయితే, తాజాగా వచ్చిన మొత్తాన్ని లెక్కించగా.. బిల్లు చట్టబద్దమైనదేనని ఈ ముద్దుగుమ్మ స్పష్టం చేసింది.
-
So after an hour long meeting, crazy amount of numbers n calculations floating around, realised the “approximate” reading wasn’t really THAT approximate. Infact far from it. pic.twitter.com/rSjb36JKaA
— taapsee pannu (@taapsee) July 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">So after an hour long meeting, crazy amount of numbers n calculations floating around, realised the “approximate” reading wasn’t really THAT approximate. Infact far from it. pic.twitter.com/rSjb36JKaA
— taapsee pannu (@taapsee) July 2, 2020So after an hour long meeting, crazy amount of numbers n calculations floating around, realised the “approximate” reading wasn’t really THAT approximate. Infact far from it. pic.twitter.com/rSjb36JKaA
— taapsee pannu (@taapsee) July 2, 2020
"ఒక గంటపాటు సుదీర్ఘ చర్చల అనంతరం.. ఈ భారీ బిల్లును లెక్కించగా అంతా సరిపోయింది. మొదట ఈ రసీదును చూడగానే శీతాకాలం సమయంలో రావాల్సిందేమో అనుకున్నా. ఇది మా అందరినీ నిజంగా ఆశ్చర్యపోయేలా చేసింది. ఇంత మొత్తం ఎలా వచ్చిందో ఎవ్వరికీ అర్థం కాలేదు. కానీ దీని వివరణను ఓపికగా చెప్పినందుకు అదానీ విద్యుత్ సంస్థకు ధన్యవాదాలు. భవిష్యత్తులో ఇలాంటి విషయాల్లో ముందు జాగ్రత్త తీసుకుంటారని ఆశిస్తున్నా."
తాప్సీ పన్ను, బాలీవుడ్ నటి
ఈ విద్యుత్ బిల్లుల కష్టాలు ఇప్పటికే అనేక మంది ప్రముఖులకు ఎదురయ్యాయి. వారిలో బాలీవుడ్ ప్రముఖులు రిచా చద్దా, కవితా కౌషిక్, రేణుకా షహానే, వీర్ దాస్, అమైరా దస్తూర్, తుషార్, షట్లర్ గుత్తా జ్వాలా ఉన్నారు. ఈ క్రమంలోనే సామాజిక మాధ్యమాల్లో వినియోగ దారుల నుంచి వెల్లువెత్తిన ఆరోపణలపై మహారాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(ఎమ్ఈఆర్సీ) స్పందించింది. ఆటోమెటిక్ మీటర్ రీడింగ్ సౌకర్యం ఉన్న చోట తప్ప.. మార్చి నుంచి మే వరకు లాక్‌డౌన్ కాలంలో సగటు వినియోగం ఆధారంగా వినియోగదారులకు విద్యుత్ బిల్లు పెంచినట్లు వెల్లడించింది.
ఇదీ చూడండి:మీకు కోటి ధన్యవాదాలు చెప్పిన సరిపోవు: మహేశ్