ETV Bharat / sitara

'సుశాంత్ విషయంపై అమితాబ్​ మౌనమేల?' - Kangana amitab

సుశాంత్​కు జరిగిన అన్యాయంపై అమితాబ్​ సహా ఖాన్​ త్రయం(సల్మాన్​, షారుక్​, ఆమిర్​) ఎందుకు నోరు విప్పట్లేదని ప్రశ్నించింది హీరోయిన్​ కంగనా రనౌత్​. యువనటుడు విషయంలో బిగ్​ బీ లాంటి స్టార్​ హీరోనే మాట్లాడటానికి భయపడితే.. మద్దతు ఇవ్వడానికి ఎవరు ముందుకు వస్తారు? అని అడిగింది.

Amitab
అమితాబ్​ బచ్చన్
author img

By

Published : Aug 20, 2020, 4:34 PM IST

Updated : Aug 20, 2020, 9:18 PM IST

బాలీవుడ్​ నటుడు సుశాంత్​.. చిత్రసీమలో నెపోటిజమ్ (బంధుప్రీతి)​ వల్లే ఆత్మహత్యకు పాల్పడ్డాడని పలువురిపై బహిరంగంగానే విమర్శలు గుప్పించింది హీరోయిన్​ కంగనా రనౌత్​. నటుడికి న్యాయం జరిగేంతవరకు తాను పోరాడతానని స్పష్టం చేసింది.

తాజాగా ఓ ప్రముఖ ఛానెల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై మాట్లాడిన కంగన.. ఖాన్ త్రయం (సల్మాన్​, షారుక్​, అమీర్​) సహా అమితాబ్​ బచ్చన్​ను ప్రశ్నించింది. మీరెందుకు ఈ అంశంపై మౌనం పాటిస్తున్నారు? సుశాంత్​ కేసును సీబీఐకి అప్పగించాలని ఎందుకు అడగలేదు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది.

అన్యాయంపై మాట్లాడటానికి అమితాబ్​ లాంటి ఓ స్టార్​ నటుడే భయపడితే.. సుశాంత్​కు మద్దతు ఇవ్వడానికి ఎవరు ముందుకొస్తారు? అని ప్రశ్నించింది.

జూన్​ 14న ముంబయిలోని తన ఇంట్లో సుశాంత్​ బలన్మరణం చెందాడు. అయితే ఇతడి చావు వెనుక చాలా మంది కుట్ర ఉందని కంగాన ఆరోపించింది. ఎన్నో మలుపుల తర్వాత.. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేపట్టాలని ఆగస్టు 19న తీర్పు వెలువరించింది సుప్రీం కోర్టు.

ఇది చూడండి 'అవును.. సుశాంత్​, సారా​ ప్రేమలో పడ్డారు!'

Last Updated : Aug 20, 2020, 9:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.