ETV Bharat / sitara

బాలీవుడ్​కు వీడ్కోలు పలికిన సుశాంత్​ హీరోయిన్​! - బాలీవుడ్​

బాలీవుడ్​లోకి ఇంక తిరిగి రాకపోవచ్చని పరోక్షంగా అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది నటి సంజనా సంఘి. సుశాంత్​ మృతిపై జరుగుతున్న విచారణకు హాజరైన ఈ నటి.. తిరుగు ప్రయాణంలో తన ఇన్​స్టాగ్రామ్​ వేదికగా ఓ భావోద్వేగపు పోస్టు పెట్టింది.

Sushant Singh Rajput's Dil Bechara co-star Sanjana Sanghi heads back to Delhi
'బై.. ముంబయి.. ఇంక తిరిగి రాకపోవచ్చు'
author img

By

Published : Jul 2, 2020, 11:20 AM IST

Updated : Jul 2, 2020, 12:31 PM IST

బాలీవుడ్​ నటి సంజనా సంఘి.. తన ఇన్​స్టాగ్రామ్​లో ఓ భావోద్వేగపు పోస్టును తాజాగా షేర్​ చేసింది. హీరో సుశాంత్​సింగ్​ రాజ్​పుత్​ మృతిపై పోలీసుల విచారణ కోసం దిల్లీ నుంచి ముంబయికి వచ్చిన ఈ నటి.. తిరుగు ప్రయాణంలో నగరానికి వీడ్కోలు చెబుతున్న విధంగా ఇన్​స్టాగ్రామ్​ స్టోరీ పెట్టింది. ముంబయికి ఇక తిరిగి రాకపోవచ్చనే ఆలోచన తనలో ఉన్నట్లు అందులో వ్యక్తమవుతోంది.

Sushant Singh Rajput's Dil Bechara co-star Sanjana Sanghi heads back to Delhi
సంజనా సంఘి ఇన్​స్టాగ్రామ్​ స్టోరీ

"గుడ్​బై ముంబయి.. నాలుగు నెలల తర్వాత నిన్ను చూస్తున్నా. ఇప్పుడు నేను తిరిగి దిల్లీ వెళ్లిపోతున్నా. నీ వీధులన్నీ భిన్నంగా, నిర్జీవంగా కనిపిస్తున్నాయి. బహుశా నా గుండెలోని బాధ వల్లే నా చూపు అలా మారిందేమో! లేదంటే నువ్వు కూడా భారంగా ఉన్నావో మరి. త్వరలో కలుద్దాం. లేదా కలవకపోవచ్చు".

- సంజనా సంఘి, బాలీవుడ్​ కథానాయిక

సుశాంత్​ మృతిపై విచారణలో భాగంగా బాంద్రా పోలీసులు సుమారు 7 గంటలకు పైగా సంజనను ప్రశ్నించారు.

బాలీవుడ్​ దివంగత నటుడు సుశాంత్​సింగ్​ రాజ్​పుత్​ హీరోగా తెరకెక్కిన చివరి చిత్రం 'దిల్​ బెచారా'లో హీరోయిన్​గా నటించింది సంజనా సంఘి. లాక్​డౌన్​ కారణంగా ఈ సినిమా విడుదల ఆగిపోవడం వల్ల.. ఓటీటీల్లో నేరుగా విడుదల చేయాలని నిర్మాణ సంస్థ నిర్ణయించింది. డిస్నీప్లస్ హాట్​స్టార్​లో ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చూడండి... తెలుగు చిత్రపరిశ్రమలో కొత్త అందాల సవ్వడి

Last Updated : Jul 2, 2020, 12:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.