ETV Bharat / sitara

మొన్న మేనేజర్​.. ఈరోజు అతడే.. కారణమేంటి?

author img

By

Published : Jun 14, 2020, 3:52 PM IST

Updated : Jun 14, 2020, 11:20 PM IST

బాలీవుడ్ నటుడు, హీరో సుశాంత్ సింగ్ రాజ్​పుత్ ఆత్మహత్య చేసుకున్నారు. ముంబయి బాంద్రాలోని తన నివాసంలో ఈరోజు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే ఈ యువ నటుడు చనిపోయిన 6 రోజుల ముందు(జూన్​ 9న) తన మాజీ మేనేజర్​ దిశా శాలిన్.. ఓ భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ నేపథ్యంలో హీరో మృతి చర్చనీయాంశంగా మారింది.

sushant singh rajput passes away
మొన్న మేనేజర్​..ఈరోజు అతడే... కారణమేంటి?

'ధోని: ది అన్‌టోల్డ్‌ స్టోరీ' చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరో సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకున్నారు. ముంబయిలోని తన నివాసంలో ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఒత్తిడి ఉందా..?

సుశాంత్ సింగ్ రాజ్​పుత్ దగ్గర మేనేజర్​గా పనిచేసిన దిశా శాలిన్.. జూన్​ 9న ఆత్మహత్య చేసుకుంది. ముంబయిలో తాను ఉంటున్న అపార్ట్​మెంట్​ 14వ అంతస్థు నుంచి దూకింది. తీవ్రంగా గాయపడిన ఆమెను.. సమీప బోరివాలీ ఆస్పత్రికి తీసుకెళ్లగా, ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈమె మరణంపై పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. ఆమె బలవన్మరణానికి పాల్పడ్డ ఆరు రోజుల్లోనే ఈ స్టార్​ హీరో ఆత్మహత్య చేసుకోవడం దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ సమయంలో ఏం జరిగింది? ఈ హీరో ఎవరి నుంచి అయినా ఒత్తిడి ఎదుర్కొన్నారా? వంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆ సినిమాతో హిట్​...

సుశాంత్‌ సింగ్‌ తొలుత టెలివిజన్‌ నటుడిగా కెరీర్‌ను ఆరంభించారు. 2008లో స్టార్ ప్లస్​లోని ఓ సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయం అయ్యారు. ఆ సీరియల్ మంచి విజయం సాధించగా.. అతడి పేరు మారు మోగిపోయింది. ఆ తర్వాత 2013లో బాలీవుడ్‌ చిత్రం 'కై పో చీ'తో వెండితెరకు పరిచయమైన సుశాంత్‌ వరుస చిత్రాలు చేస్తూ ఆకట్టుకున్నారు. 'శుద్ధ్‌ దేశీ రొమాన్స్‌', 'పీకే','డిటెక్టివ్‌ బ్యోమ్​కేశ్ బక్షి' తదితర చిత్రాల్లో నటించారు. టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌, మిస్టర్‌ కూల్‌ ఎం.ఎస్‌.ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'ఎం.ఎస్‌.ధోని: ది అన్‌టోల్డ్‌ స్టోరీ' చిత్రంతో ఒక్కసారిగా యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించారు. నీరజ్‌ పాండే దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికిగానూ ఫిలింఫేర్ అవార్డునూ అందుకున్నారు.

ఆ తర్వాత సుశాంత్‌ 'రాబ్తా', 'వెల్‌కమ్‌ న్యూయార్క్‌', 'కేదార్‌నాథ్‌', 'సంచీరియా', 'చిచ్చోరె', 'డ్రైవ్‌' చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా ‘దిల్‌ బెచరా’ చిత్రీకరణ దశలో ఉంది.

Last Updated : Jun 14, 2020, 11:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.