*సూర్య కొత్త సినిమా 'ఎతరుక్కుమ్ తునిందవన్' షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రాన్ని త్వరలో థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే సూర్య గత చిత్రాలు 'ఆకాశం నీ హద్దురా!', 'జై భీమ్'.. ఓటీటీలో విడుదలై నెటిజన్ల నుంచి విశేషాదరణ దక్కించుకున్నాయి. వాటిని థియేటర్లో చూడలేకపోయామే అని బాధపడుతున్న ఆయన అభిమానులు.. ఇప్పుడు కొత్త సినిమాతో ఖుషీ కానున్నారు. సన్‌పిక్చర్స్ నిర్మించగా, పాండిరాజ్ దర్శకత్వం వహించారు.

*టీమ్ఇండియా మహిళా స్టార్ క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ 'శెభాష్ మిథు'. తాప్సీ టైటిల్ రోల్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. త్వరలో అప్డేట్స్ ఇవ్వడం సహా రిలీజ్ డేట్‌ను ప్రకటించే అవకాశముంది.

*యాక్షన్ మూవీ 'గణ్పథ్' షూటింగ్లో హీరోయిన్ కృతిసనన్ పాల్గొంది. ఈ విషయాన్ని హీరో టైగర్‌ష్రాప్ ట్వీట్ చేశారు. ఇందులో తాను బైక్ రైడ్, స్టంట్స్ చేయనున్నట్లు కృతి చెప్పింది.
-
Time for some more action 🙅🏻 more dhamaka 💥
— Tiger Shroff (@iTIGERSHROFF) November 10, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Welcoming my leading lady, Jassi, as she begins the UK schedule of #Ganapath.
Can't wait to reunite with you @kritisanon!@vashubhagnani #VikasBahl @jackkybhagnani @honeybhagnani @poojafilms #GoodCo pic.twitter.com/vLEvz0yCsZ
">Time for some more action 🙅🏻 more dhamaka 💥
— Tiger Shroff (@iTIGERSHROFF) November 10, 2021
Welcoming my leading lady, Jassi, as she begins the UK schedule of #Ganapath.
Can't wait to reunite with you @kritisanon!@vashubhagnani #VikasBahl @jackkybhagnani @honeybhagnani @poojafilms #GoodCo pic.twitter.com/vLEvz0yCsZTime for some more action 🙅🏻 more dhamaka 💥
— Tiger Shroff (@iTIGERSHROFF) November 10, 2021
Welcoming my leading lady, Jassi, as she begins the UK schedule of #Ganapath.
Can't wait to reunite with you @kritisanon!@vashubhagnani #VikasBahl @jackkybhagnani @honeybhagnani @poojafilms #GoodCo pic.twitter.com/vLEvz0yCsZ
*శివకార్తికేయన్ 'డాన్' సినిమా ఫస్ట్‌లుక్ రిలీజైంది. ఇటీవల 'వరుణ్ డాక్టర్' సినిమాతో అలరించిన ఇతడు.. ఇప్పుడు కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో తీసిన ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 'డాన్'క్ శిబి చక్రవర్తి దర్శకత్వం వహించారు. అనిరుధ్ సంగీతమందించారు.

*సాయి రోనక్, నేహా సోలంకి జంటగా నటించిన చిత్రం 'ఛలో ప్రేమిద్దాం'. సురేశ్ శేఖర్ దర్శకత్వం వహించిన సినిమా టీజర్‌ను బుధవారం రిలీజ్ చేశారు. ఉదయ్ కిరణ్ నిర్మించిన ఈ చిత్రంతో హీరోహీరోయిన్ల మధ్య జరిగే ప్రేమ, సంఘర్షణ తదితర అంశాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: