ETV Bharat / sitara

సూర్య 'కాఖా కాఖా' చిత్రానికి సీక్వెల్‌? - కాఖా కాఖా సీక్వెంల్

తమిళ నటుడు సూర్య నటించి ఘనవిజయం సాధించిన చిత్రం 'కాఖా కాఖా'. గౌతమ్ మేనన్ దర్శకుడు. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్​పై స్పందించాడు మేనన్.

సూర్య 'కాఖా కాఖా' చిత్రానికి సీక్వెల్‌?
సూర్య 'కాఖా కాఖా' చిత్రానికి సీక్వెల్‌?
author img

By

Published : Aug 7, 2020, 9:40 PM IST

Updated : Aug 7, 2020, 9:58 PM IST

తమిళ నటుడు సూర్య - జ్యోతిక నటించిన హిట్ చిత్రం 'కాఖా కాఖా'. గౌతమ్‌ మేనన్‌ దర్శకత్వంలో యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంగా వచ్చిన ఈ సినిమాకు కలైపులి ఎస్‌.థాను నిర్మాత. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్‌ను చేయనున్నట్లు దర్శకుడు గౌతమ్‌ మేనన్‌ ఓ పత్రికకు ఇచ్చిన ముఖాముఖిలో తెలిపారు.

"సినిమాకు సంబంధించిన స్క్రిప్టును ఇప్పటికే సిద్ధం చేశా. అదీకాక సూర్య తను నటించే పోలీస్‌ పాత్రల సినిమాల మధ్య గ్యాప్‌ కావాలని కోరాడు" అని తెలిపారు గౌతమ్.

సూర్య 2017లో వచ్చిన 'సింగం-3' తరువాత గతేడాది వచ్చిన ‘'బందోబస్త్' చిత్రంలోనూ పోలీస్‌ పాత్రలోనే నటించారు. ఆగస్టు 1, 2003లో విడుదలైన 'కాఖా కాఖా' సినిమా ఇప్పటికి 17 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. తెలుగులో ఈ చిత్రం 'ఘర్షణ'గా రీమేక్ అయ్యింది. వెంకటేష్‌ - ఆసిన్‌ నాయికానాయకులుగా నటించారు. తెలుగులోనూ ఘనమైన విజయాన్ని నమోదు చేసుకొంది.

Last Updated : Aug 7, 2020, 9:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.