ETV Bharat / sitara

హీరోయిన్​ అవ్వాల్సింది... గయ్యాళిగా మారింది - సూర్యకాంతం బర్తడే స్పెషల్​

తనదైన నటనటో అభిమానుల మనసులో చోటు సంపాదించుకుంది టాలీవుడ్​ దివంగత నటి సూర్యకాంతం. నేడు ఆమె జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం మీ కోసం..

Surya kantham
సూర్యకాంతం
author img

By

Published : Oct 28, 2020, 5:31 AM IST

గయ్యాళి అత్త అనగానే గుర్తొచ్చే పేరు సూర్యకాంతం. ఎన్ని తరాలు మారినా తెలుగుదనం ఉన్నంత వరకు గుర్తుండిపోయే సహజ నటి! పాత్రను పరిపూర్ణంగా సొంతం చేసుకోవడం అంటే ఏమిటో.. అదెలా సాధ్యమో ఆమే నటనను చూసి నేర్చుకోవాలనిపిస్తుంది. ఆంగికం, వాచకం, అభినయం కలగలిసిన త్రివేణీ సంగమం- మన సూర్యకాంతం! నేడు ఆమె జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం మీ కోసం..

Surya kantham
సూర్యకాంతం

అప్పట్లోనే అల్లరి పిల్లగా

1924 అక్టోబరు 28న కాకినాడ సమీపంలోని వెంకటకృష్ణరాయపురంలో జన్మించిన సూర్యకాంతానికి చిన్నప్పుడే అల్లరి అమ్మాయిగా ముద్ర పడిందట. స్కూల్లో పంతులమ్మని ఏడిపించడం, ఊళ్ళో సైకిల్‌ మీద చక్కర్లు కొట్టడం, సూటిగా సుత్తితో మేకును దిగ్గొట్టినట్లు మాట్లడడం ఆమెకు చిన్నప్పుడే అలవడ్డాయట!

సినీరంగ ప్రవేశం

కాకినాడ యంగ్‌మెన్స్‌ హ్యాపీక్లబ్‌ నాటకాల్లో వేషాలు వెయ్యడం ద్వారా ఆమెకు అంజలి, ఆదినారాయణరావు, యస్వీ రంగారావులాంటి ప్రముఖులతో పరిచయమై, ఆమె ఆసక్తి వెండితెరవైపు మళ్లింది. నృత్య సన్నివేశాల్లో గుంపులో కనిపించడం, కథానాయకుల పక్కన చెలికత్తెగా నటించడం లాంటి పాత్రలు చేసింది.

Surya kantham
సూర్యకాంతం

ఫేస్‌వాల్యూ

మాటల మధ్యలో ముక్కు ఎగపీలుస్తూ, గొంతులో దుఃఖం పలికిస్తూ, కొంగుతో కన్నీళ్లు తుడుచుకునే ఘట్టాల్లో సూర్యకాంతాన్ని చూడండి- నిజజీవితంలో మనకు బాగా తెలిసిన వారు కనిపిస్తారు. మెటికెలు విరుస్తూ, శాపనార్థాలు పెడుతూ, తిట్ల వర్షం కురిపించినప్పుడు- ‘అచ్చం మన లాగే ఉంది కదంటూ’ ప్రేక్షకులు తమ సన్నిహితులతో సరిపోల్చుకుంటారు. ఒక తరంలో గయ్యాళితనానికి సూర్యకాంతం పేరు పర్యాయపదమైపోయిందంటే అతిశయోక్తి కాదు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మలుపు తిరిగింది

అదిగో.. అప్పుడు వచ్చింది సాధనవారి సంసారం (1950). ఎన్టీఆర్, ఏయన్నార్‌లు హీరోలుగా ఎల్వీప్రసాద్‌ దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం సూర్యకాంతాన్ని కయ్యాలమారిగా గయ్యాళిగంపగా నిలబెట్టింది. ఆమె చలనచిత్ర జీవితానికి ఓ దశనూ, దిశనూ నిర్దేశించింది. కొన్ని పాత్రల్నీ కొన్ని సంభాషణల్నీ, ఊతపదాల్నీ కేవలం సూర్యకాంతం కోసమే రచయితలు, దర్శకులు సృష్టించిన సందర్భాలు చాలా ఉన్నాయి.

తాను తింటూ మరొకరికి పెడుతూ

సూర్యకాంతం మనిషి మామిడల్లం... మనసు పటికబెల్లం అన్నారు ఆరుద్ర. ఇంటి నుంచి క్యారేజ్ నిండా మోసుకొచ్చి షూటింగ్‌లో అందరికీ వడ్డించిన ఆమె చేతి రుచుల్ని వెనకటి తరం సినిమా ప్రముఖులు కథలు కథలుగా చెప్పుకొంటారు. తాను సంపాదించి మరొకరికి సహాయం చెయ్యడం వంటి గొప్ప లక్షణాలు ఉన్నాయి. ఆ మహానటి 1994 డిసెంబరు 18 నాడు తనువు చాలించారు.

అవకాశం కోల్పోయిందిలా...

1951లో శ్రీ రాజ రాజేశ్వరి ఫిలిం కంపెనీ వారు కె.బి.నాగభూషణం దర్శకత్వంలో నిర్మించిన సౌదామిని చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు సరసన హేమవతి పాత్రకోసం సూర్యకాంతానికి కబురెళ్లింది. ఆ సమయంలో ఒక కారు ప్రమాదంలో చిక్కుకున్న సూర్యకాంతానికి ముఖం నిండా గాయాలయ్యాయి. అలా హీరోయిన్‌ అవకాశం తలుపు తట్టినట్లే తట్టి వెళ్ళిపోయింది.

ఇదీ చూడండి '‌విజయ్​ కుమార్తె గురించి అసభ్యంగా మాట్లాడింది నేనే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.