విక్టరీ వెంకటేశ్ 'నారప్ప'.. రానున్న మంగళవారం (జులై 20) ఓటీటీలో విడుదల కానుంది. అయితే ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ చేయకపోవడంపై పలువురు అభిమానుల అసంతృప్తి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఇప్పుడు ఈ విషయమై నిర్మాత సురేశ్‌బాబు స్పందించారు.
'నారప్ప' నిర్మాణంలో తాము భాగస్వాములం మాత్రమేనని, నిర్మాత(కలైపులి ఎస్.థాను) నిర్ణయం మేరకే ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు సురేశ్‌బాబు స్పష్టం చేశారు. కరోనాతో నష్టపోకూడదనే ఓటీటీకి ఇచ్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం థియేటర్లకు వెళ్లే పరిస్థితులు లేవని, ప్రజలను థియేటర్లకు రమ్మనడం కరెక్ట్ కాదని సురేశ్‌బాబు అన్నారు. భవిష్యత్ ఓటీటీదే అని అభిప్రాయపడ్డారు.
సురేశ్ ప్రొడక్షన్స్‌లో తీసే చిత్రాలు తన నిర్ణయం మేరకు విడదులవుతాయని సురేశ్‌బాబు తెలిపారు. తనపై ఎగ్జిబిటర్ల అసంతృప్తిలో న్యాయం ఉందని చెప్పారు. సినిమా ప్రజలకు చేరువ చేసేందుకు నిర్మాత కష్టపడతారని, టికెట్ ధర కంటే తక్కువ ధరకే ఓటీటీలో సినిమా చూడొచ్చని సురేశ్‌బాబు అభిప్రాయం వ్యక్తం చేశారు.
వెంకీ క్షమాపణలు..
మరోవైపు హీరో వెంకటేశ్.. తన సినిమాను ఓటీటీలో విడుదల చేయడంపై అభిమానులకు క్షమాపణలు చెప్పారు. ఫ్యాన్స్ ఎప్పుడు తనకు అండగా నిలిచారని, 'నారప్ప' విషయంలోనే పరిస్థితిని అర్ధం చేసుకుని మద్దతుగా నిలుస్తారని భావిస్తున్నట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: