40 ఏళ్లకు ఒకసారి దర్శనమిచ్చే కాంచీపురం అత్తివరదరాజ స్వామిని మంగళవారం అర్ధరాత్రి సతీసమేతంగా దర్శించుకున్నారు సూపర్‌స్టార్ రజనీకాంత్ దంపతులు. ప్రత్యేక పూజలు జరిపి ఆలయ పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు.
కేవలం 48 రోజులు మాత్రమే అందుబాటులో ఉండే అత్తివరదరాజస్వామి దర్శనం... ఈ నెల 17తో ముగుస్తుంది. ఇందుకోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. చివరగా 1979లో కనిపించారు స్వామివారు. ఇప్పుడు మళ్లీ 40 ఏళ్ల తర్వాతే భక్తులకు దర్శన భాగ్యం కలిగింది.
![Superstar Rajinikanth Athivardar darsan at midnight](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4134604_tn-che01-aththivaradhar-rajini-1.jpg)
స్వతహాగా భక్తుడైన రజనీకాంత్.. తరచుగా హిమాలయాలకు వెళుతుంటారు. వాటితో పాటే వివిధ ఆలయాలను సందర్శిస్తుంటారు. ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'దర్బార్'లో పోలీసుగా కనిపించనున్నారు.
ఇది చదవండి: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్‌తో సూపర్ స్టార్ రజనీకాంత్