ETV Bharat / sitara

Allu arha award: అల్లు అర్జున్ కుమార్తె అర్హ రికార్డు - shakuntalam movie

అల్లు అర్జున్ తనయ అర్హ(allu arha chess) ఘనత సాధించింది. చిన్న వయసులోనే నోబుల్ బుక్​ రికార్డు దక్కించుకుంది. యంగెస్ట్ చెస్ ట్రైనర్​గా గుర్తింపు తెచ్చుకుంది.

Allu Arha
అర్హ
author img

By

Published : Nov 22, 2021, 9:08 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అర్హ(allu arha photos) అరుదైన ఘనత సాధించింది. నాలుగేళ్లకే నోబుల్ బుక్ అవార్డును(allu arha noble world record) దక్కించుకుంది. ప్రపంచంలోనే పిన్న వయస్కురాలైన చెస్ ట్రైనర్​గా నిలిచింది. చెస్​పై ఆమెకున్న ఆసక్తిని గమనించిన కుటుంబసభ్యులు అర్హను ఓ చెస్ అకాడమీలో శిక్షణ ఇప్పించారు. అర్హ తాను నేర్చుకోవడమే కాకుండా ఇతరులకూ నేర్పించే ప్రయత్నం చేసింది.

రెండు నెలల వ్యవధిలో 50 మందికి పైగా ట్రైనింగ్‌ ఇచ్చింది. అర్హ(allu arha chess) టాలెంట్‌ను తెలుసుకున్న నోబుల్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు సంస్థ ప్రతినిధులు అర్హకు ఇటీవల ఓ పరీక్ష పెట్టారు. ఆమె నైపుణ్యం గుర్తించి 'వరల్డ్‌ యంగెస్ట్‌ చెస్‌ ట్రైనర్' అవార్డును అందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను అల్లు అర్జున్‌(allu arjun movies) సతీమణి స్నేహ, సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు.

ఆదివారం అర్హ పుట్టినరోజు(allu arha birthday) కావడం వల్ల సంబరాలు ఆకాశన్నంటాయి. దుబాయ్‌లోని అత్యంత ఎత్తైన సౌధం బుర్జ్‌ ఖలీఫాలో(burj khalifa height) అర్హ బర్త్‌డే వేడుకలు జరిగాయి. 5వ వసంతంలోకి అడుగుపెట్టిన అర్హ త్వరలోనే వెండితెరపై సందడి చేయనుంది. సమంత ప్రధాన పాత్ర పోషించిన 'శాకుంతలం'తో(shakuntalam movie) నటిగా ప్రేక్షకుల్ని పలకరించనుంది. గుణశేఖర్‌ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రమిది. మహాభారతం ఆదిపర్వంలోని శకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా రూపొందుతోంది.

ఇది చదవండి: బుర్జ్​ఖలీఫాపై అర్హ బర్త్​డే పార్టీ.. విదేశీ పర్యటనలో ఎన్టీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.