దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి నానాటికీ విజృంభిస్తున్న వేళ అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు తన అభిమానులతో పాటు, ప్రజలందరికీ సందేశాన్ని ఇచ్చారు. అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన సమయమిదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా జాగ్రత్తలను సూచించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"లాక్‌డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. మనల్ని, మన చుట్టుపక్కల ఉన్నవారిని రక్షించుకోవాల్సిన సమయమిది. బయటకు వెళ్లిన ప్రతిసారీ తప్పకుండా మాస్క్ ధరించండి. మీ పరిసరాల్లో అప్రమత్తంగా ఉండండి. భౌతికదూరం తప్పక పాటించండి. ఇప్పటికే మీరు ఆరోగ్యసేతు యాప్‌ను వినియోగించకపోతే వెంటనే డౌన్‌లోడ్ చేసుకోండి. మీ సమీపంలోని కరోనా పాజిటివ్ కేసుల వివరాలు ఎప్పటికప్పుడు తెలుస్తాయి. అంతేకాదు, ఆరోగ్య సంరక్షణకు, అత్యవసర సేవలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అందరూ క్షేమంగా ఉండండి. అప్రమత్తంగా బాధ్యతతో వ్యవహరించండి"
- మహేశ్‌బాబు, ఇన్‌స్టాగ్రామ్ సందేశం
లాక్‌డౌన్ కాలాన్ని మహేశ్‌బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి ఆస్వాదిస్తున్నారు. తన పిల్లలు గౌతమ్, సితారలతో ఆడుకుంటున్నారు. పరిస్థితులు చక్కబడిన వెంటనే పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'సర్కారు వారి పాట' చిత్రీకరణలో పాల్గొననున్నారు.