ETV Bharat / sitara

స్టేజ్​పైనే ఏడ్చేసిన హీరోహీరోయిన్

author img

By

Published : Jan 23, 2021, 12:03 PM IST

నవీన్ చంద్ర, చాందినీ చౌదరి ప్రధానపాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'సూపర్ ఓవర్'. శుక్రవారం ఆహా వేదికగా విడుదలైన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమాకు దర్శకత్వం చేసిన ప్రవీణ్ షూటింగ్ ఆఖరి దశలో కారు ప్రమాదంలో కన్నుమూశారు. తాజాగా ఆ ఘటనను గుర్తు చేసుకున్న హీరో,హీరోయిన్ స్టేజ్​పైనే కన్నీరు పెట్టుకున్నారు.

Super Over emotional success meet
స్టేజ్ పైనే ఏడ్చేసిన హీరోహీరోయిన్

సినిమా ప్రమోషన్‌ కోసం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌ అనుకోని విధంగా భావోద్వేగపూరితంగా మారింది. తమ సినిమా గురించి మాట్లాడుతూ హీరో, హీరోయిన్‌ స్టేజ్‌పైనే కన్నీటి పర్యంతమయ్యారు. క్రికెట్‌ బెట్టింగ్‌ కథాంశంగా తెలుగులో తెరకెక్కిన చిత్రం 'సూపర్‌ ఓవర్‌'. బెట్టింగ్‌ వల్ల సమాజంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనేది క్షుణ్ణంగా తెలియజేస్తూ తెరకెక్కిన ఈ చిత్రంలో 'కలర్‌ఫొటో' ఫేమ్‌ చాందినీ చౌదరి, నవీన్‌ చంద్ర ప్రధాన పాత్రలు పోషించారు. దర్శకుడు సుధీర్‌ వర్మ వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన ప్రవీణ్‌ ఈ చిత్రంతో దర్శకుడిగా మారారు. అయితే ఈ సినిమా షూటింగ్‌ దశలో ఉన్నప్పుడు.. కారు ప్రమాదంలో దర్శకుడు ప్రవీణ్‌ కన్నుమూశారు. దీంతో మిగిలిన చిత్రాన్ని సుధీర్‌ వర్మ పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కాగా, తాజాగా జరిగిన ఈ సినిమా ప్రమోషన్‌లో ప్రవీణ్‌ను గుర్తు చేసుకుని చాందినీ, నవీన్‌, దర్శకుడు సుధీర్‌ కన్నీరు పెట్టుకున్నారు. "మా సినిమా 'సూపర్‌ ఓవర్‌' మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నా. ఇలాంటి ఒక మంచి సినిమాలో మమ్మల్ని భాగం చేసినందుకు ప్రవీణ్‌కు థ్యాంక్యూ. ఈ చిత్రాన్ని ప్రవీణ్‌కే అంకితం చేస్తున్నాం. తను ఎక్కడ ఉన్నా సరే ఈ చిత్రాన్ని వీక్షించి సంతోషిస్తాడని అనుకుంటున్నా. మీ అందరితో కలిసి పనిచేసినందుకు నాకెంతో ఆనందంగా ఉంది" అంటూ నటి చాందినీ కన్నీరు పెట్టుకున్నారు.

అనంతరం నటుడు నవీన్‌ చంద్ర మాట్లాడుతూ.. "ప్రవీణ్‌వర్మ చాలా మంచి వ్యక్తి. ఆయన ఈరోజు మన మధ్య లేకపోవడం ఎంతో బాధగా ఉంది. ఆయన గురించి మాట్లాడడం కూడా కష్టంగా ఉంది. ఈ సినిమా కోసం టీమ్‌ మొత్తం ఎంతగానో శ్రమించింది. ఒక మనిషి ఆశయాన్ని నిజం చేయాలనే ఉద్దేశంతో సుధీర్‌ ఈ ప్రాజెక్ట్‌ను తన చేతుల్లోకి తీసుకుని పూర్తి చేశారు. సుధీర్‌కు ఎంతలా థ్యాంక్స్‌ చెప్పినా సరిపోదు. మా సినిమా షూట్‌లో ప్రతిరోజూ ప్రవీణ్‌నే గుర్తు చేసుకునేవాళ్లం. మేమే ఇంతలా బాధపడుతున్నామంటే ఆయన కుటుంబం ఎంతటి బాధను అనుభవిస్తుందో అర్థం చేసుకోగలం. ఆయన కుటుంబానికి దేవుడు అండగా ఉండాలని కోరుకుంటున్నా" అంటూ నవీన్‌ ఎమోషనల్‌ అయ్యారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.